Newsఆ సింగర్ ని యాంకర్ ఓంకార్ అంతలా ప్రేమించాడా..? స్టేజీ పైనే...

ఆ సింగర్ ని యాంకర్ ఓంకార్ అంతలా ప్రేమించాడా..? స్టేజీ పైనే ప్రపోజ్.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటే..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోకి ఎంత క్రేజ్ – పబ్లిసిటీ – పాపులారిటీ ఉంటుందో అంతకు డబల్ కాదు ట్రిపుల్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు యాంకర్ ఓంకార్ . ఆయన ఎలాంటి స్థానంలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . యాంకరింగ్ చేస్తూనే మరోవైపు పలు సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగ ఇలాంటి క్రమంలోనే ఓంకార్ కి సంబంధించిన పర్సనల్ విషయం వైరల్ గా మారింది.

ఓంకార్ తన ఫ్యామిలీ విషయాలను సోషల్ మీడియాలో చాలా తక్కువగా షేర్ చేసుకుంటూ ఉంటారు . అసలు చాలామందికి ఆయనకి పెళ్లయిందా ..?లేదా..? అనేది కూడా తెలియదు . అయితే సోషల్ మీడియాలో మాత్రం ఓంకార్ స్టార్ సింగర్ ని చాలా ఘాటుగా ప్రేమించారని .. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని .. కానీ ఆమె అప్పటికే వేరే అబ్బాయితో ప్రేమలో ఉండడంతో ఆయన ప్రపోజల్ని సున్నితంగా తిరస్కరించింది అంటూ ప్రచారం జరుగుతుంది .

గతంలో ఆయన హోస్ట్ చేసిన షో కి కూడా ఆమె వచ్చిందని.. అప్పుడు తన మనసులోని మాటని ఓపెన్ గానే షో లోనే చెప్పుకొచ్చాడు . ప్రపోజ్ కూడా చేశారు . దీంతో అప్పట్లో ఎన్నోసార్లు ఈ న్యూస్ ట్రెండ్ అయింది . అయితే అలా ప్రపోజ్ చేసిన కొన్ని నెలలకే ఆ సింగర్ పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది . దీంతో ఓంకార్ ఫస్ట్ ప్రేమ విఫలమైంది అంటూ ప్రచారం చేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news