టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ప్రేమాయణం చాలా సీక్రెట్ గా నడిచింది. దాదాపు 5 సంవత్సరాలుగా ఎంతో సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ జంట తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. వాస్తవానికి ఆగస్టులో ఈ జంట పెళ్లి జరుగుతుందన్న ప్రచారం గట్టిగా జరిగింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లావణ్య- వరుణ్ పెళ్లి కొద్ది నెలలపాటు పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తుంది.
వరుణ్ సోదరి నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగబాబు ఫ్యామిలీ ఆ డిస్టబెన్స్ లో ఇబ్బంది పడుతోంది. అందుకే వరుణ్ తేజ్ పెళ్లిని కొద్ది నెలలపాటు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నాగబాబు ఇంటికి కోడలుగా రాబోతున్న లావణ్య సైతం ఆడపడుచు కాపురం కూలిపోవడంతో కాస్త డైలమాలలో పడినట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుని నాగబాబు ఇంటికి కోడలుగా వస్తే ఆ ఫ్యామిలీ డిస్టబెన్స్ తమ వైవాహిక జీవితానికి ఎక్కడ ఇబ్బంది వస్తాయో అన్న ఆందోళన కూడా లవణ్యను వెంటాడుతుందట.
ఈ క్రమంలోనే నాగబాబు ఫ్యామిలీకి ఆమె ఇప్పటికే తాను పెళ్లి చేసుకునేది తన భర్తతో కలిసి ఎంజాయ్ చేయటానికి నా వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవటానికి అంతేకానీ మీకు బానిసగా ఉండటానికి కాదు మీరు నాకు రూల్స్ పెట్టి నియంత్రచ వద్దు అని కరాకండిగా చెప్పేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఈమండి రామారావు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంటే నిహారిక విడాకుల వల్ల తమ వైవాహిక జీవితానికి ఇలాంటి ఇబ్బందులు లేకుండా తమ సంసారం సాఫీగా ఉండాలని తమ సంసార బంధం పై ఎలాంటి కండిషన్లో పెట్టవద్దని లావణ్య ఇప్పటికే నాగబాబు ఆయన భార్యకు చెప్పినట్టు సమాచారం.