Moviesవరుణ్ తేజ్ మొబైల్ లో లావణ్య పేరు ఏమని సేవ్ చేసుకుని...

వరుణ్ తేజ్ మొబైల్ లో లావణ్య పేరు ఏమని సేవ్ చేసుకుని ఉన్నాడో తెలుసా..? సార్ మంచి రొమాంటిక్ ఫెలోనే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ .. ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకుని నటిస్తున్న సినిమా “గాండీవదారిఅర్జున”.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ సుమ కనకాల హోస్ట్ చేస్తున్న సుమ అడ్డ షో కి గెస్ట్ గా హాజరయ్యారు .

కాగ ఈ షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నాడు వరుణ్ తేజ్. సుమ కూడా తన హెల్తి పంచెస్ తో జనాలను బాగా ఎంటర్టైన్ చేసింది . ఈ క్రమంలోనే ఆడియన్స్ ప్రశ్నిస్తూ..” లావణ్య పేరును తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నారు అనే విధంగా క్వశచన్ చేశారు..?”. అయితే దీనికి వరుణ్ చాలా సిగ్గుపడుతూ సమాధానం ఇచ్చారు .

“LAVN” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో నిశ్చితార్ధం అవ్వకు ముందా..? లేకపోతే కెరియర్ స్టార్టింగ్ లోనా..? అంటూ ప్రశ్నిస్తుంది .ఆమె ఫోన్ తీసుకుని నెంబర్ తనే సేవ్ చేసింది అంటూ వరుణ్ తేజ్ బదులిస్తాడు . అంతే కాదు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఏంటి..? అంటూ ప్రశ్నిస్తుంది . చాలా కాలం అయ్యింది కదా గుర్తులేదు అంటూ లైట్ తీసుకోమంటాడు . సోషల్ మీడియాలో ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news