Moviesమహేశ్-నమ్రతల పెళ్లి జరగడానికి కారణం త్రిషనా..? ఈ ట్విస్ట్ ఏంట్రా బాబు..!!

మహేశ్-నమ్రతల పెళ్లి జరగడానికి కారణం త్రిషనా..? ఈ ట్విస్ట్ ఏంట్రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూట్ రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు మహేష్ బాబు – నమ్రత . టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న కృష్ణ కొడుకు మహేష్ బాబు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు . ఆ తర్వాత ఆయన పలు సినిమాలో నటించి క్రేజీ హీరోగా మారిపోయారు . ఇలాంటి క్రమంలోనే ఆయన వంశీ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నమ్రతతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఇలాంటి క్రమంలోనే ఆయన నమ్రతని చూసి చూడగానే ప్రేమలో పడిపోయారు . ఇలా ప్రేమ మొదలై కొన్నేళ్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపించుకున్నారు . అయితే వన్ ఫైన్ డే చాలా సింపుల్ గా వీళ్ళ పెళ్లి జరిగింది. అయితే అంతటి పెద్ద సూపర్ స్టార్ హీరో ఇంత సింపుల్గా పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటా..?అంటు అప్పట్లో జనాలు పెద్దగా చర్చించుకున్నారు. దానికి కారణం త్రిష అంటూ బయటపడింది .

మహేష్ బాబు హీరోగా త్రిష జంటగా నటించిన ఫస్ట్ సినిమా అతడు . ఈ సినిమాలో వీళ్ళ కెమిస్ట్రీ సూపర్ డూపర్ గా ఉంటుంది. రియల్ బావ మరదలు ఇలాగే ఉండాలి అనే రేంజ్ లో చూపించాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు . 2004లో ఈ సినిమా ప్రారంభమైంది . అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో మహేష్ బాబు త్రిష చాలా చాలా క్లోజ్ గా మూవ్ అతున్నారని మీడియాలో వార్తలు వినిపించాయి . ఈ వార్తలు అటు ఇటు నమ్రత చెవిన పడ్డాయి. దీంతో వెంటనే మహేష్ ని పెళ్లి చేసుకోమని డిమాండ్ చేసిందట . లేకపోతే బ్రేకప్ చెప్పేస్తానంటూ భయపెట్టిందట. దీంతో వేరే గత్యంతరం లేక మహేష్ బాబు చాలా సింపుల్ గా ఉన్న ముహూర్తానికి పెళ్లి చేసేసుకున్నారట . అలా త్రిష కారణంగానే మహేష్ బాబు నమ్రత తల పెళ్లి జరిగింది అనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news