Moviesచిరంజీవి-మహేశ్ బాబు కాంబో లో మిస్ అయిన 100కోట్ల సినిమా ఇదే..!!

చిరంజీవి-మహేశ్ బాబు కాంబో లో మిస్ అయిన 100కోట్ల సినిమా ఇదే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి.. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు . అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొడుతున్న చిరంజీవి రీసెంట్గా భోళా శంకర్ సినిమాతో థియేటర్స్ లో సందడి చేశారు. అయితే ఈ సినిమా ఊహించనంత హిట్ కాలేకపోయింది . ఒరిజినల్ కథ కాకపోవడం ఆల్రెడీ రీమిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు.

ఈ సినిమా ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఇలాంటి క్రమంలోనే చిరంజీవి – మహేష్ బాబు కాంబోలో తెరకెక్కాల్సిన సినిమా మిస్సయింది అన్న వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఎస్ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో స్క్రీన్ షేర్ .. చేసుకోవాల్సింది కానీ అది రిజెక్ట్ అయిపోయింది. ఆ ప్లేస్లో రవితేజ నటించాడు.

ఆ సినిమా మరి ఏదో కాదు వాల్తేరు వీరయ్య . బాబి దర్శకత్వంలో తెర్కెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ పాత్ర కోసం మహేష్ బాబును కూడా అప్రోచ్ అయ్యారట డైరెక్టర్ బాబి. కానీ కథ అనుసారం ఈ సినిమా మాస్ గా ఉండడంతో తన బాడీకి సెట్ అవ్వదు అంటూ మహేష్ బాబు సున్నితంగా ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారట . అలా వీళ్ల కాంబో లో రావాల్సిన సినిమా మిస్సైంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news