టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులరిటి సంపాదించుకున్న సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి మనకు తెలిసిందే. కాగా దీనికి కొన్నాళ్లపాటు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో దూసుకుపోయిన సమంతకు మరోసారి మయోసైటీస్ వ్యాధి తిరగబడింది . ఈ క్రమంలోనే వ్యాధి రోజురోజుకి ఎక్కువ అయిపోతూ ఉండడంతో ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పి మరి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అమెరికా వెళ్ళింది .
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్గా ఎయిర్ పోర్ట్ లో తన తల్లితో కలిసి ఫ్లైట్ ఎక్కారు . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లోకి వచ్చాయి . అయితే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన మరో విషయం వైరల్ గా మారింది . నిజానికి ఖుషి రిలీజ్ తర్వాత సమంత అమెరికా వెళ్ళాలని భావించిందట. కానీ ఇంతలోనే అరుదైన గౌరవం దక్కింది .
వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పెరేడ్ లో పాల్గొనే అవకాశం లభించింది . ఈనెల 20వ తేదీన న్యూయార్క్ లో జరగనున్న భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సామ్ పాల్గొనబోతుంది. అందుకే సమంత తన ప్లాన్ చేంజ్ చేసుకుని కాస్త ముందుగానే అమెరికాకు బయలుదేరింది అంటూ ప్రచారం జరుగుతుంది . మరి న్యూయార్క్ లోని స్వతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తి అయిన తర్వాత సమంత ఖుషి ప్రమోషన్స్ కోసం ఇండియాకు వస్తుందా..? లేదా..? ట్రీట్మెంట్ కోసం అక్కడే ఉండి ప్రమోషన్ బాధ్యతలను మొత్తం విజయ్ దేవరకొండ పై వేస్తుందా అనేది ఇంకా తెలియ రాలేదు . చూడాలి మరి సమంత ఏం చేస్తుందో..?