Moviesయాంకర్ రష్మి పై బేబి ప్రొడ్యూసర్ బూతు కామెంట్స్.. అంత పచ్చిగా...

యాంకర్ రష్మి పై బేబి ప్రొడ్యూసర్ బూతు కామెంట్స్.. అంత పచ్చిగా చెప్పాడు ఏంట్రా బాబు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది . ఒక సినిమాను డైరెక్టర్ ఏదో విధంగా తెరకెక్కిచ్చేస్తారు ..నటీనటులు కూడా ఏదో విధంగా ముక్కిమూలిగి నటించేస్తారు. కానీ తమదైన స్టైల్ లో ఆ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి నానా రకాల తంటాలు పడుతూ అక్కడక్కడ పలు స్ట్రాటజీలు ఉపయోగిస్తూ వల్గర్ డైలాగ్స్ యూస్ చేస్తున్నారు . మొన్నటికి మొన్న డిజే టిల్లు సినిమా టైంలో హీరోయిన్ పుట్టుమచ్చ గురించి ఎంత రచ్చ రంబోలా జరిగిందో మనకు తెలిసిందే .

ఆ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా దూసుకుపోయాయో కూడా మనం చూసాం. రీసెంట్ గా బేబీ సినిమా ప్రమోషన్స్ లోనూ అదే జరిగింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన బేబీ సూపర్ డూపర్ హిట్ ..పెట్టిన దానికి ఏకంగా ఐదు రెట్లు లాభాలు తీసుకొచ్చింది. రీసెంట్గా అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు బాయ్స్ హాస్టల్ టీం . నితిన్ కృష్ణమూర్తి డైరెక్షన్లో తెరకెక్కిన యూత్ ఫుల్ క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ బాయ్స్ హాస్టల్ . ఈ మూవీ 2023లో కన్నడలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయింది .

ఇప్పుడు తెలుగులో ఆగస్టు 26న విడుదల కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ క్రమంలోనే బాయ్స్ హాస్టల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ మాట్లాడుతూ సినిమాల్లో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేసిన యాంకర్ రష్మీ పై డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఘాటైన పంచులు వేసి బాయ్స్ ని అలరించారు . ఆయన మాట్లాడుతూ” కాలేజీ హాస్టల్ బాయ్స్ రూమ్స్ లో రష్మి గౌతమ్ ఫొటోస్ గోడ మీద అంటించి ఉంటాయి అని”డబుల్ మీనింగ్ డైలాగ్స్ వచ్చేలా ఘాటుగా కామెంట్ చేసాడు.

దీనితో ఒక్కసారిగా రష్మి గౌతమ్ కూడా షాక్ అయిపోయింది . అంతేకాదు ఆ తర్వాత ఆయన మాటలను కప్పిపుచ్చుతూ చాలామంది బాయ్స్ హాస్టల్ లో ఇలాగే ఉంటుంది అంటూ మాటలు కవర్ చేశారు. అంతే కాదు ఆ తర్వాత ఇకనుంచి మా బేబీ వైష్ణవి ఫోటోలు కూడా ఉండాలి అంటూ కామెంట్ చేశారు. దీనితో స్టేజిపై ఇద్దరు పరువు తీసినట్లైంది. దీంతో వెంటనే రిటర్న్ కామెంట్ చేసింది రష్మీ ..మీ ఇంట్లో ఎవరు ఫోటో ఉందంటూ ఘాటుగా స్పందించింది”. అయితే సండే మండే ట్యూస్డే ఇలా వీక్ మొత్తం ఒక్కొక్కరు మారుతూ ఉంటారు అంటూ బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చాడు ప్రొడ్యూసర్. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news