తమిళ సినిమా పరిశ్రమలో అమలాపాల్ ఎప్పటినుంచో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. అమల నటనాపరంగా ఎన్నో సినిమాలలో నటించి మంచి మార్కులు వేయించుకుంది. ఆమె తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం ఉన్న హీరోయిన్. తెలుగులో రామ్ చరణ్ కి జోడిగా ఎవడు, నాగచైతన్యతో బెజవాడ లాంటి సినిమాలలో నటించింది. ఎన్నో తమిళ డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా ఇక్కడ ప్రేక్షకులకు పరిచయమే.
ఈ క్రమంలోనే తమిళ డైరెక్టర్ విజయ్ మిల్టన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న అమల ఆ తర్వాత మనస్పర్ధలు నేపథ్యంలో విడాకులు కూడా తీసుకుంది. ముఖ్యంగా అమలాపాల్ – ధనుష్ మధ్య ఉన్న వ్యవహారమే వీరిద్దరూ విడిపోవడానికి కారణం అన్న పుకార్లు కూడా తమిళనాడులో ఉన్నాయి. అలాంటి అమలాపాల్ పై మరో తమిళ హీరో అధర్వ మురళి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఆమె చెత్త హీరోయిన్ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఆధర్వ మురళి ఎవరో కాదు తమిళ హీరో మురళి కుమారుడు. 2019లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా కొత్త వెబ్ సిరీస్ మధకం ప్రమోషన్లలో అధర్వ మాట్లాడుతూ తనతో నటించిన హీరోయిన్లలో అమలాపాల్ చెత్త హీరోయిన్ అని చెప్పాడు.
నా రెండో సినిమా ముహుద్ముత్ ఉన్ కర్పనై లో మేమిద్దరం కలిసి నటించాం.. షూటింగ్ ప్రారంభమయ్యాక మొదటి పది రోజుల్లోనే అమలతో నాకు ఒక చిన్న వివాదం జరిగింది.. నాకు చాలా బాధ అనిపించింది తర్వాత మళ్లీ ఇద్దరి మధ్య ఈ గొడవ సెట్ అయింది.. కానీ ఆమె ఒక చెత్త హీరోయిన్ అనే విషయాన్ని నేరుగా అమలాపాల్ కి చెప్పాను అని అధర్వ తెలిపాడు. అధర్వ ఇప్పుడు అమలాపాల్‌పై చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెద్ద దుమారం రేపుతున్నాయి.