Newsహిట్ కొట్టాడు... త‌న ప‌క్క‌న హీరోయిన్‌నే పెళ్లాడుతోన్న కుర్ర హీరో...!

హిట్ కొట్టాడు… త‌న ప‌క్క‌న హీరోయిన్‌నే పెళ్లాడుతోన్న కుర్ర హీరో…!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ‌ పెళ్లి అనేది చాలా కామన్. ఇప్పటికే చాలామంది హీరో, హీరోయిన్లు ఇలా పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. ఈ లిస్టులోకే ఇప్పుడు మరో జంట కూడా చేరబోతుంది. ప్రస్తుతం కలిసి ఓ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ జంట త్వరలోనే రియల్ లైఫ్ లో కూడా కలిసి ఏడడుగులు వేయబోతున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా మారింది.

మరి ఆ హీరో, హీరోయిన్ ఎవరు ? తెలుసుకుందాం. కోలీవుడ్ కుర్ర హీరో అశోక్ సెల్వ‌న్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా కొంతవరకు తెలుసు. పిజ్జా 2 – భద్రమ్‌ లాంటి డబ్బింగ్ సినిమాలతో చాన్నాళ్ల క్రితమే అశోక్ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. 2020లో వచ్చిన ఓ మై కడవులే సినిమా సూపర్ హిట్ అవడం ఇతడికి చాలా ఫ్ల‌స్ అయింది.

ఆ తర్వాత వరుస‌పెట్టి అశోక్‌కు అవకాశాలు వచ్చాయి. గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలలో హీరోగా నటించాడు. మరో రెండు సినిమాలలో గెస్ట్ రోల్లో మెరిశాడు. ప్రస్తుతం బ్లూ స్టార్ సినిమాలో నటిస్తున్న అశోక్ సెల్వ‌న్‌ ఈ సినిమాలో తనతో పాటు కలిసిన నటిస్తున్న హీరోయిన్ కీర్తి పాండియన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడట.

సెప్టెంబర్ 13న ఇద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారికి ప్రకటన రానుంది. ఇక కీర్తి పాండియన్ ప్రస్తుతం కోలీవుడ్ లో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. తుంబ – అన్బిర్కినియాల్ సినిమాలతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు తాను నటిస్తున్న సినిమా హీరోతోనే ప్రేమ పెళ్లికి సిద్ధం అవ్వడం సంచలనంగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news