అభిమానం వేరు.. అనుబంధం వేరు అని కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరోసారి నిరూపించారు. తాను రజనీకాంత్ వీరాభిమానిగా గతంలో ధనుష్ చాలాసార్లు బహిరంగంగానే చెప్పుకున్నారు. ఆ తర్వాత అనూహ్యంగా తన వీరాభిమాని రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను ధనుష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చాలా ఏళ్లపాటు ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.
అయితే అనూహ్యంగా గత ఏడాది ధనుష్ – ఐశ్వర్య మనస్పర్ధలు కారణంగా విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు. అప్పటినుంచి చాలాకాలంగా రజినీకాంత్ కుటుంబానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ధనుష్ తాజాగా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతుంది. రజని కథానాయకుడుగా నటించినా తాజా సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.
చాలా ఏళ్ల తర్వాత రజనీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోని ధనుష్ ఇట్స్ జైలర్ వీక్ ( ఇది జైలర్ వారం) అంటూ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ధనుష్యబిమానులు తాను ముందు రజనీకాంత్ అభిమాని అని.. ఆ తర్వాతే అన్ని అని ధనుష్ మరోసారి నిరూపించారు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ధనుష్ చేసిన ఈ కామెంట్ సినిమాపై మరింత హైప్ రావడానికి కారణమైంది. ఏదేమైనా ధనుష్ తన భార్యకు విడాకులు ఇచ్చేసినా మామపై ఉన్న అభిమానం మరోసారి చాటుకున్నాడు.