రెండు వారాల గ్యాప్ లో మెగాస్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ చిరంజీవి నటించిన బ్రో, భోళాశంకర్ సినిమాలో రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు కూడా భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే కావటం విశేషం. పైగా పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ కు తోడు సాయిధరమ్ తేజ్ కూడా నటించాడు. విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే కావడం. రెండు సినిమాల డైరెక్టర్లు కూడా పెద్దగా అంచనాలు ఉన్న డైరెక్టర్లు కాకపోవటం కూడా సినిమాలకు కొంత మైనస్ అయింది.
బ్రో సినిమాకు పవన్ కళ్యాణ్ కేవలం 22 రోజులు కాల్ సీట్లు ఇచ్చి 55 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్న ప్రచారం జరిగింది. ఇక భోళాశంకర్ సినిమాకు చిరంజీవి 65 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా.. మరో ఐదు కోట్ల వరకు చిన్నాచితకా ఖర్చులు ఖర్చు పెట్టారట నిర్మాత అనిల్ సుంకర. అంటే కేవలం చిరంజీవి రెమ్యూనరేషన్ గా 70 కోట్లు ఆయన ఖాతాలోకి వెళ్లినట్టు అనుకోవాలి. ఇక జైలర్, భోళాశంకర్ సినిమాలు థియేటర్లలోకి రావడంతో బ్రో సినిమా థియేటర్ పూర్తయింది.
ఈ సినిమాకు ఓవరాల్ గా రు. 30 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లో 30 శాతానికి పైగా రికవరీ కావాల్సి ఉందంటున్నారు. ఇక భోళాశంకర్ సినిమాకు చిరంజీవి గత సినిమాలతో పోలిస్తే చాలా తక్కువగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తొలి రోజే కలెక్షన్లు సరిగా లేవు. డిజాస్టర్ టాక్ వచ్చేసింది. ఈ సినిమా దెబ్బతో నిర్మాత అనిల్ సుంకర రు. 50 కోట్లకు పైగా నష్టపోతారని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.
అంటే కేవలం రెండు వారాల వ్యవధిలో అన్నదమ్ములు ఇద్దరు కలిసి బాక్సాఫీస్ కు రు. 80 కోట్లకు పైగా బొక్క పెట్టినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఇకనుంచి అయినా రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకుని నిర్మాతను కాపాడుతూ సరైన కథాబలం ఉన్న సినిమాలు ఎంచుకుంటే ? ఇండస్ట్రీని కాస్త కాపాడిన వారు అవుతారు. అలాగే వీళ్ళ కెరీర్ కు మంచి మనుగడ ఉంటుందన్న.. సూచనలు.. సలహాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.