Moviesఅమెరికా నుంచి రాగానే సమంత మొదట చేసే సినిమా ఇదే.. ఆమెకు...

అమెరికా నుంచి రాగానే సమంత మొదట చేసే సినిమా ఇదే.. ఆమెకు ఎంత స్పెషల్ అంటే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ పొజిషన్లో ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా సమంత విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది . అయితే వాటిని ఏమాత్రం పట్టించుకోని సమంత తన పని తాను చేసుకుపోతుంది. రీసెంట్ గానే విజయ్ దేవరకొండ సరసన ఖుషి అనే సినిమా.. వరుణ్ ధావన్ నటిస్తున్న బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సిటాడిల్ వెబ్ సిరీస్ షూట్స్ ని కంప్లీట్ చేసుకున్న సమంత.. త్వరలోనే అమెరికా వెళ్ళబోతుంది .

ఎస్ సమంత అమెరికా వెళుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . సమంత సైతం సినిమా ఇండస్ట్రీకి కొన్నాళ్లపాటు బ్రేక్ వేస్తున్నానని ఓపెన్ గా చెప్పుకొచ్చింది . ఆమెకు మయోసైటీస్ వ్యాధి మళ్ళీ తిరగబడిందట. ఈ క్రమంలోనే అమెరికాలో ట్రీట్ మెంట్ తీసుకోవడానికి వెళుతుందట. అయితే సమంత అమెరికా నుంచి తిరిగి రాగానే మొట్టమొదట చేయబోయే సినిమాపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడింది .

సమంత ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళి.. నుంచి తిరిగి రాగానే మొదటి సైన్ చేసేది .. షూటింగ్ స్టార్ట్ చేసేది తాప్సీ నిర్మాణం చేస్తున్న సినిమా అని తెలుస్తుంది . ఇప్పటికే తాప్సీ ప్రొడ్యూసర్ గా ఓ సినిమాకి కమిట్ అయింది సమంత అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇది ఫుల్ టు ఫుల్ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తుందట తాప్సి. దీనితో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ట్రెండింగ్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news