ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ ఎలా ఓపెన్ గా ఉన్న విషయాన్ని ఉన్నట్టు మాట్లాడుతున్నారో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం మాట్లాడితే అస్సలు అబద్ధాలు ఆడటం లేదు ఉన్న విషయాని ఉన్నట్టు చెప్పేస్తున్నారు . అంతేకాదు పాత తాలూక జ్ఞాపకాలను సైతం బయటపెడుతూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు . తాజాగా అలాంటి కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది అందాలు ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో తమన్న ఎంత హాట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుందో.
టాప్ తీసేసి మరి శృంగార సన్నివేశాలల్లో నటిస్తుంది . అయితే రీసెంట్గా నటించిన లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా సంచలన కామెంట్స్ చేసింది . మరీ ముఖ్యంగా బాలీవుడ్ మీడియాలో తెలుగు హీరోలపై అలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు నెట్టింటి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. తమన్నా మాట్లాడుతూ..” నేను చాలామంది హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అయితే నాకు బాగా నచ్చింది మాత్రం రామ్ చరణ్ – చైతన్య . వీళ్ళ ఇద్దరికీ అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో తెలుసు.. అమ్మాయిలని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసు.. అంత గొప్పగా వాళ్ళ తల్లిదండ్రులు పెంచారు .
ఆ విషయంలో చిరంజీవి సార్ కి నాగార్జునసాగర్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అంతే కాదు ఇండస్ట్రీలో నేను టాప్ హీరోయిన్ అవుతాను అని నమ్మిన మొదటి వ్యక్తి చిరంజీవి గారే . చరణ్ తో కలిసి సినిమా చేస్తున్న టైంలో నాకు ఆ విషయాన్ని చెప్పారు. నాగార్జున సార్ తో నటించడం చాలా బాగా అనిపిస్తుంది . చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది . అంతవరకు పర్లేదు కానీ మిగతా హీరోలు ఏం పాపం చేశారో అన్న విషయమే ఇప్పుడు అర్థం కాకుండా మారిపోయింది . తెలుగులో చాలా మంది హీరోలతో తమన్న స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఇద్దరే ఇద్దరు హీరోలని పొగడడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అంటే మిగతా హీరోలు తమన్నాను ఏమన్నా గోకారా..? అంటూ పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు. దీనిపై తమన్న నోరు విప్పితేనే బాగుంటుంది .. లేకపోతే తేడాలు వచ్చేస్తాయి అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్స్ ఇస్తున్నారు..!!