సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడమే గగనంగా ఉన్న టైంలో వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ని ప్రారంభించి .. ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రవితేజ.. ఫస్ట్ హిట్ కోసం నాన్న తంటాలు పడ్డారు . ఎటువంటి హెల్ప్ లేకుండానే ఇండస్ట్రీలోకి స్టార్ హీరోగా వచ్చిన రవితేజకు బ్యాక్ గ్రౌండ్ నుంచి కూడా ఎటువంటి హెల్ప్ అందలేదు .
ఈ క్రమంలోనే సొంత టాలెంట్ తో మాస్ హీరోగా ఎదిగిన రవితేజ .. ప్రజెంట్ కెరియర్లో చాలా టఫ్ సిచువేషన్ ఎదుర్కొంటున్నారు. వరుసగా సినిమా అవకాశాలు వస్తున్న సరే ఒకటంటే ఒక హిట్ కూడా తన ఖాతాలో పడడం లేదు . ఈ క్రమంలోనే ఆచితూచి ఆలోచించి నిర్ణయించుకుని అడుగులు వేస్తున్న రవితేజ ..రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ” చాలా కాలం తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను” అంటూ సామజ వరగమన టీంకు బెస్ట్ విషెస్ అందించారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రవితేజ పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది. ” అంటే ఇన్నాళ్లు రవితేజ ఫుల్ డిప్రెషన్ లో ఉన్నాడా..? మనశ్శాంతి కరువైందా..? అందుకే ఈ సినిమా చూసి నవ్వుకున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నాడా..?” అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు. అంతే కాదు పలువురు ఇంతవరకు రవితేజ ఎందుకు హిట్ కొట్టలేకపోతున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు . లోపల రవితేజ కూడా బాగా బాధపడుతున్నాడు అని తాజాగా చేసిన ట్వీట్ చూస్తేనే అర్థమవుతుంది . చూడాలి మరి రవితేజ హిట్ ఎప్పుడు కొడతాడో అభిమానులను ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తాడో..?