ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. జనరల్ గా హీరోయిన్స్ అంటే కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకొని లక్షలకు లక్షల ఖర్చు పెడుతూ ఉంటారు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. సాధారణంగా ఎవరైనా సరే అదే అనుకుంటారు . అన్ని లక్షలు ఖర్చు చేయకపోతే వాళ్ళు హీరోయిన్స్ గా ఎదగలేరు అని మనం భావిస్తూ ఉంటాం . అయితే ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోయిన్స్ అలా ఉన్నప్పటికీ హీరోయిన్ రష్మిక మందన మాత్రం అలా ఎప్పుడూ చేయదట.
తనకొచ్చిన డబ్బులను జాగ్రత్తగా దాచుకుంటూనే తప్పిస్తే ఇలా పార్టీలు పబ్బులు అంటూ వాటికి తగలేయదట . ఏదో సరదాగా ఫ్రెండ్స్ పిలిస్తే తప్పిస్తే అలా వెళ్లడం.. వెళ్ళినా సరే పార్టీ బిల్లు మాత్రం తను కట్టదట .మొదటి నుంచి రష్మిక డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడిందట . గతంలో తన తండ్రి చేసిన అప్పుల కారణంగా ఫైనాన్స్ గా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నారట . అందుకే తమన్న ఇప్పుడు డబ్బులు రాగానే ముందు ఆ డబ్బులు సేవింగ్ చేసిందట .
రేపటి రోజు మన దగ్గర ఒక రూపాయి లేకపోతే ఆ రూపాయి మనకి పనికొస్తుంది అని ఇప్పటికీ మిడిల్ క్లాస్ ఆలోచనలతో రష్మిక తను డబ్బులను మొత్తం దాచేస్తుందట . కోట్లు వచ్చిన సరే వేలు ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడదట రష్మిక . అందుకే ఈ బ్యూటీ ని తెగ పొగడేస్తున్నారు సామాన్య జనాలు . ప్రతి అమ్మాయి ఇలాగే ఆలోచించాలి అని ..డబ్బులు ఊరికే రావు అని కామెంట్స్ చేస్తున్నారు..!!