Newsవెంకటేష్ హీరో అని తెలిసి .."సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" సినిమాని...

వెంకటేష్ హీరో అని తెలిసి ..”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో మల్టీ స్టారర్. సినిమాలకు నాంది పలికిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించారు. అప్పటివరకు సింగల్ హీరోలే వరుసగా హిట్ కొడుతున్న సినిమాలు వచ్చిన ఇండస్ట్రీలో ఇద్దరు హీరోలు కలిసి కూడా హిట్ కొట్టగలరని ప్రూవ్ చేసింది ఈ సినిమానే. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ విజయాన్ని అందుకుంది .

ఈ సినిమాలో హీరోయిన్లుగా అంజలి – సమంత నటించారు. చిన్నోడా..పెద్దోడా అంటూ మహేష్ బాబు – వెంకటేష్ పాత్రను బాగా డిజైన్ చేశాడు శ్రీకాంత్. కాగ మహేష్ బాబు పాత్ర కోసం ఈ సినిమాలో మొదటగా అనుకున్న హీరో పవన్ కళ్యాణ్ అంటూ తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కి మొదట ఈ కథను చెప్పారట మేకర్స్. అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమాను అత్తారింటికి దారేది మూవీలో బిజీగా ఉన్నాను డేట్స్ ఖాళీగా లేవు అంటూ రిజెక్ట్ చేసారట. అయితే నిజానికి పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసింది హీరోగా వెంకటేష్ నటిస్తున్నారు అని అప్పట్లో ప్రచారం జరిగింది .

పవన్ కళ్యాణ్ వెంకటేష్ లు చూడటానికి ఒకేలా ఉంటారు. ఒకే టైపు గా ఉన్న హీరోస్ ని పెట్టి సినిమా తీయాలంటే చాలా కష్టం . అది కూడా తన లుక్స్ ఉన్న హీరోని తనకు అన్నగా చూపించే ప్రయత్నం చేస్తే సినిమా ఖచ్చితంగా దెబ్బ పడిపోతుంది . అయితే ఇవన్నీ చెప్తే మేకర్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అని బలవంతంగా సినిమాకి ఎలా అయినా ఒప్పిస్తారేమోనని పవన్ కళ్యాణ్ డేట్స్ ఖాళీ లేవు అంటూ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేసారట . ఆ తర్వాత ఈ పాత్ర కోసం మహేశ్ ని చూస్ చేసుకున్నారు. తన కెరీర్ లో ఓ మంచి పాత్రను పోషించారు . ఇప్పటికీ ఈ సినిమాలో మహేష్ బాబు రోల్ చాలామంది లేడీస్ లైక్ చేస్తూ ఉంటారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news