ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోల కన్నా సీనియర్ హీరోలే బెటర్ అనే విధంగా కథలను చూస్ చేసుకుంటున్నారు సీనియర్ హీరోలు. యంగ్ హీరోలు రెండు సంవత్సరాలకు ఒకటి ..మూడు సంవత్సరాలకు రెండు సినిమాలు చూస్తుంటే ..సీనియర్ హీరోలు మాత్రం సంవత్సరానికి రెండు -మూడు సినిమాలను సైన్ చేస్తూ సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు . కాగా అదే లిస్టులోకి వస్తాడు నందమూరి బాలకృష్ణ . గ్లోబల్ లయన్ గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ ప్రెసెంట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా రాజ్యమేలేస్తున్నారు .
రీసెంట్ గానే వీరసింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో.. ప్రజెంట్ అనిల్ రావిపూడి తో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నాడు . ఆ తర్వాత మెగా డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు బాలయ్య . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ – నయనతార ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది .అయితే ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఖతర్నాక్ బ్యూటీని చూస్ చేసుకున్నాడు బాబీ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .
వీరసింహారెడ్డి సినిమాలో బావ మరదలుగా నటించిన హనీ రోజ్ – బాలయ్యను మరోసారి తెరపై చూపించబోతున్నాడు బాబి . ఈ సినిమాలో హనీ రోజ్ హాట్ ఐటమ్ సాంగ్ లో నటించడానికి ఓకే చేసిందట . అంతేకాదు మా బావ మనోభావాలు దెబ్బతిన్నయ్యా టైప్ లోనే ఈ సాంగ్ కూడా డిజైన్ చేయబోతున్నడట బాబీ. ఫుల్ నాటి రొమాంటిక్ ఫోక్ సాంగ్ గా ఈ పాట తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . దీంతో బాలయ్య ఫ్యాన్స్ మరోసారి హనీరోజ్ – బాలకృష్ణను తెర పై చూడచ్చు అంటూ క్రేజీ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు..!!