Moviesచైతన్య కంటే ముందే సమంత ని ఆ హీరో ప్రేమించాడా..? తాళ్లి...

చైతన్య కంటే ముందే సమంత ని ఆ హీరో ప్రేమించాడా..? తాళ్లి వరకు వెళ్లిన పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది..?

సినిమా ఇండస్ట్రీలో రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్న నాగచైతన్య – సమంత ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త కారణంగా ట్రెండ్ అవుతూనే ఉంటారు . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సమంత పేరు సోషల్ మీడియాలో ఎలా ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే. అయితే ఇలాంటి క్రమంలోనే సమంతకి సంబంధించిన ఓ పాత జ్ఞాపకాన్ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు. సమంత – నాగచైతన్య కంటే ముందే ఓ స్టార్ హీరోని ప్రేమించిందని ..పెళ్లి చేసుకోవాలనుకునిందని.. గుడిలో కూడా పూజలు చేసిందని ..లాస్ట్ మూమెంట్లో అతగాడికి హ్యాండ్ ఇచ్చి నాగచైతన్య వలలో వేసుకుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు .

ఆ హీరో మరెవరో కాదు సిద్ధార్ధ్. బాయ్స్ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన సిద్ధార్ధ్.. తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసి ఇండస్ట్రీని షేక్ చేశాడు . అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో పలు రకాల సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారిపోయిన సిద్ధార్ధ్.. హీరోయిన్ సమంతని గాఢంగా ప్రేమించారట . ఆమె కూడా అతనిని డీప్ గా లవ్ చేసిందట . ఈ క్రమంలోనే జాలి జాలీగా తిరిగి ఎంజాయ్ కూడా చేశారు అన్న వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి.

అయితే పెళ్లి చేసుకోవాలన్న క్రమంలో శ్రీ కాళహస్తి గుడిలో వీళ్ళు పూజలు కూడా చేశారట . కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ.. సడన్గా ఈ జంట బ్రేకప్ చెప్పేసుకొని ..ఎవరి దారి వాళ్లది అన్నట్లు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంతను ముందు ప్రేమించింది సిద్ధార్ధ్ అని ..అతగాడే పెళ్లి చేసుకోవాలనుకున్నాడని.. కానీ ఆ ప్లేస్ లోకి నాగచైతన్య వచ్చి బలైపోయాడు అని వార్తలు వైరల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మరోసారి సమంత – నాగచైతన్య పేర్లు వైరల్ గా మారిపోయాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news