Moviesప్రభాస్ వద్దు అని దండం పెట్టేసిన సినిమాతో హిట్ కొట్టిన ఎన్టీఆర్..ఆ...

ప్రభాస్ వద్దు అని దండం పెట్టేసిన సినిమాతో హిట్ కొట్టిన ఎన్టీఆర్..ఆ హిట్ మూవీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం .. ఇది ఓ మాయాలోకం .ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు గెస్ చేయలేరు. స్టార్ హీరోలైనా సరే కొన్ని కొన్ని సార్లు బోల్తా కొట్టాల్సిందే . మరి ముఖ్యంగా సినిమాల చూసింగ్ విషయంలో ఈ సినిమా జనాలకి నచ్చుతుందా..? లేదా..? అని అంచనా వేయడం విషయంలో స్టార్ హీరోలు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకునే సందర్భాలు ఉన్నాయి . ఆ లిస్టులోకే వస్తాడు రెబల్ హీరో ప్రభాస్ . తన వద్దకు వచ్చిన ఎన్నో బ్లాక్ బస్టర్ కధలను ఫ్లాప్ పోతాయని చెప్పి భయంతో రిజెక్ట్ చేసి ఆ తర్వాత కథలు వేరే హీరో దగ్గరికి వెళ్లి హిట్ కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి .

అలాంటి సినిమాలల్లో ఒకటే ఈ సినిమా. ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ” బృందావనం “. ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశారు . ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది . ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ – సమంతలు హీరోయిన్లుగా నటించారు . ప్రకాష్ రాజ్ – శ్రీహరి – కోటా శ్రీనివాసరావు – తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రలు పోషించి ఈ సినిమా విజయానికి కారుకులయ్యారు .

అయితే ఈ సినిమాని మొదటగా వంశీ పైడిపల్లి ప్రభాస్ కు వినిపించారట. ప్రభాస్ ఈ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ కావడంతో ఎక్కడ తేడా కొడితే కెరీర్ రిస్క్ లో పడుతుంది అని భయపడి.. ప్రభాస్ ఈ సినిమాను లైక్ చేయలేదట . అందుకే ఈ సినిమా రిజెక్ట్ చేశారట . ఆ తర్వాత ఈ కథ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి సూపర్ డూపర్ హిట్ అయింది. కాగా ప్రపంచవ్యాప్తంగా 2010 అక్టోబర్ 14న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ ని నమోదు చేసుకుంది . బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ అందుకుంది ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news