Movies"బ్రో" సినిమాలో "మార్కాండేయ" చెల్లిగా నటించిన ఈ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్...

“బ్రో” సినిమాలో “మార్కాండేయ” చెల్లిగా నటించిన ఈ అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..అంత పెద్ద స్టార్ హీరోయినా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా “బ్రో -ది అవుతార్”. మల్టీ టాలెంటెడ్ నటుడు కం దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ నమోదు చేసుకుంది . మరీ ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా ఏ రేంజ్ లో ఎటువంటి బాడీ మోడ్యులేషన్లు చూడాలి అనుకున్నారో.. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసి అభిమానుల కోరిక తీర్చేసాడు సముద్రఖని. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ పాత్రలో కనిపిస్తాడు . మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ సెంటిమెంట్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం గా అభిమానులను ఆకట్టుకుంది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాలో నటించిన నటీనటుల డీటెయిల్స్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . ఈ క్రమంలోనే ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ రెండో చెల్లిగా నటించిన అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి. కాగా ఈ సినిమాలో నటించిన కేతిక శర్మ , ప్రియా ప్రకాష్ వారియర్ ..ఆల్రెడీ మనకు తెలిసిన వాళ్ళు కావడంతో వాళ్ల గురించి పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు . కానీ సాయిధరమ్ తేజ్ రెండో చెల్లెలు గా నటించిన అమ్మాయి నటన బాగుండడంతో అమ్మాయి ఎవరా..? అంటూ ఆరాతీస్తున్నారు మెగా ఫాన్స్ .

ఈ క్రమంలోనే ఆ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిసి షాక్ అయిపోతున్నారు . ఈమె తమిళంలో స్టార్ హీరోయిన్ .. ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో హీరోయిన్గా నటించింది . ఈ అమ్మాయి పేరు యువ శ్రీ లక్ష్మి . అయితే ఈ హీరోయిన్ నటన చూసి చాలా మంది తెలుగు జనాలు షాక్ ప్ అయిపోతున్నారు. సముద్రఖని ఈ అమ్మాయిని ఏరి కోరి మరి ఈ పాత్రకు చూస్ చేసుకున్నారట . బ్రో సినిమాలో యువ శ్రీ లక్ష్మీ పాత్ర నటన చాలా బాగుండడంతో తెలుగులో ఆఫర్లు వెలువెత్తుతున్నాయి. త్వరలోనే ఈమె మరిన్ని స్టార్ హీరో సినిమాలలో కనిపించబోతున్నట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి . చూద్దాం మరి ఈ హీరోయిన్ ఎలా తెలుగులో మెప్పించబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news