Moviesపెళ్లి తర్వాత ఫస్ట్ టైం మెగా ఫ్యామిలీలో.. అలా చేస్తున్న కోడలు...

పెళ్లి తర్వాత ఫస్ట్ టైం మెగా ఫ్యామిలీలో.. అలా చేస్తున్న కోడలు పిల్ల లావణ్య త్రిపాఠీనే.. !!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ రీసెంట్ గా హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే . త్వరలోనే వీళ్ల పెళ్లి ఇటలీలో గ్రాండ్గా అంగరంగ వైభవంగా జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం వీళ్ళ పెళ్లి ఆగస్టు 25న ఇటలీలో జరగబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు దీనిపై మెగా కుటుంబం ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు .

కానీ మెగా కుటుంబం కి సంబంధించిన ఓ న్యూస్ మాత్రం ఇండస్ట్రీలో తెగ చక్కరలు కొడుతుంది. మెగా కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠికి మెగా ఫ్యామిలీ ఇక సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయకూడదని కండిషన్ పెట్టింది అంటూ ప్రచారం జరిగింది . అయితే అదంతా ఫేక్ అంటూ తెలుస్తుంది . మెగా ఫ్యామిలీ లావణ్య కి ఎలాంటి కండిషన్స్ పెట్టలేదట . కానీ మెగా ఫ్యామిలీకి నెగిటివ్గా మెగా ఫ్యామిలీ పరువు పోయే విధంగా ప్రవర్తించకూడదు అంటూ మాత్రం చెప్పుకొచ్చారట సురేఖ – పద్మ .

కాగా ఇలాంటి క్రమంలోనే లావణ్య త్రిపాఠి సైతం పెళ్లి తర్వాత చాలా ట్రెడిషనల్ హోమ్లీ సినిమాలు చేయడానికి ముందుకు దూసుకెళ్తుంది . రీసెంట్ గానే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ డైరెక్టర్ తో ఓ లేడీ ఓరియంటెడ్ ఫిలిం సైన్ చేసిందట . అంతేకాదు ఆమె ఖాతాలో ఇప్పుడు రెండు వెబ్ సిరీస్ లు మూడు సినిమాలు ఉన్నాయి. దీంతో నిశ్చితార్ధం ముందు కన్నా ఇప్పుడే లావణ్య జోరు పెంచిందని.. పెళ్లి తరువాత కూడా మెగా కుటుంబంలో సినిమాలు చేస్తున్న ఏకైక హీరోయిన్గా ఈ బ్యూటీ రికార్డులు నెలకొల్పబోతుందని చెప్పుకొస్తున్నారు . మొత్తానికి లావణ్య త్రిపాటి అనుకున్నది సాధించేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news