Newsమళ్ళీ హీరోయిన్ గా మెగా డాటర్ నీహారిక .. డైరెక్టర్ ఎవరంటే..?

మళ్ళీ హీరోయిన్ గా మెగా డాటర్ నీహారిక .. డైరెక్టర్ ఎవరంటే..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా డాటర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నిహారిక మళ్లీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందా..? అంటే అవునని అంటున్నారు సోషల్ మీడియా వర్గాలు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు సైతం పూర్తి చేసుకుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . మనకు తెలిసిందే నాగబాబు కూతురుగా పాపులారిటీ సంపాదించుకున్న నిహారిక.. కెరియర్లో కొన్ని సినిమాల్లో నటించింది . కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.

ఈ క్రమంలోనే సినిమాలకు టాటా గుడ్ బాయ్ చెప్పేసి పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది . అయితే భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న నిహారిక రీసెంట్ గానే అఫీషియల్ గా తన డివర్స్ ని సైతం కన్ ఫామ్ చేసింది . అప్పటినుంచి సోషల్ మీడియాలో నిహారిక ని ఏకేస్తున్నారు జనాలు . అయితే తన కాళ్లపై తన నిల్చోవాలని తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని నిహారిక మళ్లీ హీరోయిన్గా తన కెరియర్ను ప్రారంభించడానికి సిద్ధపడిందట .

ఇప్పటికే ఓ యంగ్ డైరెక్టర్ డైరెక్షన్లో సినిమాకి సైతం కమిట్ అయిందని తెలుస్తుంది. అయితే నిహారిక సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా రావడం మెగా ఫ్యామిలీకి ఏమాత్రం ఇష్టం లేదట . కానీ ఆమె తన కాళ్లపై తను నిలుచుకోవాలని తన టాలెంట్ తొక్కే అధికారం ఎవరికీ లేదని ఇలా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది . ప్రసెంట్ నీహారిక మళ్ళీ సినిమాలోకి హీరోయిన్ గా వస్తుంది అనే వార్త మరోసారి వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news