Moviesదట్ ఈజ్ నందమూరి ఫ్యాన్స్: బాల‌య్య‌ అంటే చచ్చేంత ఇష్టం.. ఆ...

దట్ ఈజ్ నందమూరి ఫ్యాన్స్: బాల‌య్య‌ అంటే చచ్చేంత ఇష్టం.. ఆ అభిమానంతో ఈ అభిమాని ఏం చేసాడో చూడండి..!!

టాలీవుడ్ నటసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య అంటే అభిమానులు ఏ రేంజ్ లో ప్రాణమిస్తారో మనందరికీ తెలిసిందే . ఆయన ఓ హీరోలా కాకుండా దేవుళ్ళ భావిస్తూ ఉంటారు ..ఇంట్లోని సొంత మనిషిలా ట్రీట్ చేస్తూ ఆయన పుట్టిన రోజున ఇంట్లోని పెద్దదిక్కు పుట్టినరోజులా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు . బాలకృష్ణ సైతం అంతే ఎవరైనా ఫ్యాన్స్ ఆటోగ్రాఫ్ లి.. ఫోటోగ్రాఫర్ అంటూ వచ్చినా..ఏం కసురుకోకుండా ఎంత జనాభాలో ఉన్నా సరే అందరికీ ఓపికగా ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫర్ ఇస్తూ ఉంటారు.

అలాంటి ఓ విడదీయరాన్ని సంబంధం ఉంది నందమూరి బాలకృష్ణకు ఆయన అభిమానులకు . అయితే రీసెంట్ గా ఓ అభిమాని నందమూరి ఫ్యామిలీ పై ఉన్న గౌరవంతో బాలయ్య అంటే ఉన్న ఇష్టంతో స్పెషల్ గిఫ్ట్ ని అందించారు . భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా బాలయ్య కొంచెం గ్యాప్ రావడంతో తన సతీమణి వసుంధర దేవి – మనవడితో కలిసి వెకేషన్ కోసం అమెరికా వెళ్లారు. న్యూ జెర్సీలోని జె ఎఫ్ కె విమానాశ్రయంలో బాలయ్యకు నందమూరి అభిమానులు ఘనస్వాగతం పలికారు.

దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే అమెరికాలో నందమూరి అభిమాని ఒకరు బాలయ్యకు స్పెషల్ గిఫ్ట్ తో సర్ప్రైజ్ చేశాడు . బాలయ్యపై ఉన్న అభిమానంతో సదురు అభిమాని ఓ బంగారు ఉంగరాన్ని ప్రత్యేకంగా చేయించి మరి గిఫ్ట్ గా బాలయ్యకు ఇచ్చాడు . సింహం గుర్తుతో ఉన్న ఆ బంగారు ఉంగరం బాలయ్యకు బాగా నచ్చేసిందిట . అందుకే బాలయ్య ఆయన చేతితోనే ఆ ఉంగరాన్ని తొడిగించుకున్నారు . అంతేకాదు ఈ ఉంగరం ఎప్పటికీ తీయను అంటూ కూడా ప్రామిస్ చేశారట. దీంతో బాలయ్య ఫ్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాలయ్యను అభిమానులు ఏ స్థాయిలో అభిమానిస్తారో చెప్పడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు అంటున్నారు జనాలు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news