Moviesపెద్ద చిక్కుల్లో మహేశ్ బాబు.. కంపెనీపై చీటింగ్ కేసు నమోదు..!!

పెద్ద చిక్కుల్లో మహేశ్ బాబు.. కంపెనీపై చీటింగ్ కేసు నమోదు..!!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు . వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారు . కాగా ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు మహేష్ బాబు . సినిమాల పరంగా ఎంత టాప్ పొజిషన్లో ఉంటాడో పలు బ్రాండెడ్ ని ప్రమోట్ చేయడంలో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు అంతే ముందు వరుసలో ఉంటారు. కాగ లెక్కలేనన్ని కార్పొరేట్ సంస్థలకు మహేష్ బాబు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . అయితే వీటిల్లో ఒకటే సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ.

హైదరాబాద్ వెంగళరావు నగర్ కేంద్రంగా బిజినెస్ చేస్తుంది. ఈ కంపెనీకి మహేష్ బాబు గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారకర్తగా ఉన్నారు. అయితే రీసెంట్గా ఈ కంపెనీ మోసాలకు పాల్పడుతుంది అంటూ ఓ వ్యక్తి పోలీస్ కేసు నమోదు చేశాడు. ఏకంగా మూడు కోట్ల 21 లక్షలు చీటింగ్ చేశారు అంటూ విచారణలో తేలింది . ఈ వ్యవహారంలో కంపెనీ ఓనర్ల కంచర్ల సతీష్ చంద్రగుప్త పై చీటింగ్ కేసు నమోదు అయింది . 2021 ఏప్రిల్ లో షాద్నగర్ లో 14 ఎకరాల భూమి కోసం నక్కా విష్ణువర్ధన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది .

అయితే విష్ణువర్ధన్ తో పాటు పెట్టుబడి పెట్టిన వారిలో డాక్టర్ సుధాకర్ రావు శ్రీకాకుళం పటేల్ మహేష్ – రాజేష్ లాంటి వారు కూడా ఉన్నారట . వ్యవసాయత్ర భూమి విషయంలో కంపెనీతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి త్వరలోనే అనుమతులు తీసుకుంటామని ఆ తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేస్తామంటూ సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ వాళ్ళు హామీ ఇవ్వడంతో వీళ్ళు కూడా లైట్ గా తీసుకున్నారట . అయితే ఎన్ని రోజులు గడుస్తున్న కంపెనీ వాళ్ళు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో విష్ణువర్ధన్ అతని స్నేహితులకు అనుమానం మొదలైంది .

ఈ కంపెనీ ఏదో ఫ్రాడ్ అంటూ డౌట్లు మొదలయ్యాయి . ఈ క్రమంలోనే విచారణ లో వారు పెట్టుబడి పెట్టిన భూమి అప్పటికే ఎస్వీఆర్ వెంకటేష్ కంపెనీల పేరు మీద రిజిస్టర్ అయిందట . దీంతో సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు స్నేహితులు . దీంతో విచారించిన పోలీసులు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ ఓనర్ల కంచర్ల సతీష్ చంద్రగుప్త పై చీటింగ్ కేసు నమోదు చేశారు . సెక్షన్ 406 , 420 కింద ఆర్థిక అవకతవకలు మోసానికి పాల్పడినట్లు చీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి చీప్ కంపెనీకి మహేష్ బాబు ఎలా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఒక యాడ్ ని ప్రమోట్ చేసే ముందు వెనక చూసుకోరా అంటూ పలువురు జనాలు మహేష్ బాబుని ఈ విషయంలోకి లాకి ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news