Moviesబన్ని జాతకంలో అతి పెద్ద దోషం.. ఫామ్ హౌస్ లో ప్రత్యేక...

బన్ని జాతకంలో అతి పెద్ద దోషం.. ఫామ్ హౌస్ లో ప్రత్యేక పూజాలు..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ .. ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకుని ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పాపులారిటీ దక్కించుకున్న ఈ హీరో త్వరలోనే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి తెగ ట్రెండ్ చేస్తున్నారు . పుష్ప2 సినిమాతో ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్న బన్నీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అభిమానులను టెన్షన్ పెడుతుంది.

అదే బన్నీ జాతకంలో పెద్ద దోషం ఉందని .. పరిహార పూజలు చేయకపోతే ఆయన సినిమాల పరంగా టఫ్ లైఫ్ ఎదురుకోవాల్సింది అని.. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అల్లు ఫ్యామిలీ పూజారి చెప్పుకొచ్చారట . ఈ క్రమంలోనే సడన్గా రాత్రికి రాత్రి అల్లు అర్జున్ అమ్మగారు బన్నీ జాతకంలో దోషాలు పోవడానికి పరిహార పూజలు చేయించడానికి రెడీ చేసిందట. అల్లు ఫామ్ హౌస్ లో బన్నీ – స్నేహ రెడ్డి – అల్లు అర్హ – అల్లు అయాన్ నలుగురు ఈ పూజలో పాల్గొన్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో అల్లు అర్జున్ పేరు వైరల్ గా మారింది . అంతేకాదు బన్నీ జాతకం ప్రకారం ఇండస్ట్రీ ని ఏలబోయే రారాజు ఇతడే అని.. ఆ కారణంగానే నర దిష్టి ఈయన పై ఎక్కువుగా ఉందని.. కొన్ని మార్పులు చేర్పులు చేస్తే ఇండస్ట్రీ నెంబర్ వన్ హీరోగా ఎదగడం కాకుండా ఆయన కెరియర్ కు ఎంతో ప్లస్ అవుతుందని పంతులు చెప్పడంతో అల్లు అర్జున్ అమ్మగారు ఇలాంటి డెసిషన్ తీసుకొని పూజలు చేయించారట. ఏది ఏమైనా సరే అల్లు అర్జున్ బాగోగులు కోరుకునే వారిలో అల్లు అర్జున్ అమ్మగారు ముందు ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో ఖచ్చితంగా అలు ఫ్యాన్స్ ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news