ఇది నిజంగానే అక్కినేని అఖిల్‌కు ఘోర అవమానం లాంటిదే. అసలు అఖిల్ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి సరైన హిట్ లేదు. ఫస్ట్ మూడు వరుస ప్లాపులే. నాలుగో సినిమా మిస్టర్ మజ్ను హిట్ అయినా చెప్పుకోదగ్గ హిట్ కాలేదు. ఇక భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా అయితే పెద్ద డిజాస్టర్. అసలు ఈ సినిమాకు నిర్మాత అనిల్ సుంకర పెట్టిన పెట్టుబడిలో కనీసం 10 శాతం కూడా వెనక్కు రాలేదు. అయితే రిలీజ్‌కు ముందే శాటిలైట్, ఓటీటీ రైట్స్ అమ్ముకోవడంతో నిర్మాత కొంతలో కొంత బయటపడ్డారు.
ఈ సినిమా రిలీజ్ అయ్యాక అట్టర్ ప్లాప్ అవ్వడంతో నిర్మాత అనిల్ సుంకర సైతం బౌండెడ్ స్క్రిఫ్ట్ లేకుండా షూటింగ్‌కు వెళ్లి చాలా తప్పు చేశామని చెప్పారు. అయితే గత నెలలోనే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికీ రెండు నెలలు అవుతున్నా ఏజెంట్ ఇంకా ఓటీటీలోకి రాలేదు. ఓటీటీ వెర్షన్‌ను కొంత ట్రిమ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు కూడా.. అయినా ఇంకా ఓటీటీలో రిలీజ్ కానే లేదు.
తాజాగా దీనిపై నిర్మాత అనిల్ సుంకర స్పందించారు. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై మాట్లాడుతూ అసలు రీ-ఎడిట్ లాంటివేం జరగడం లేదని చెప్పారు. ఓటీటీ కోసం కొత్తగా ఎడిటింగ్ ఎక్కడ్నుంచి చేస్తారు.. మేం ఇచ్చిందే ఎడిట్ చేయాలి కదా ? మేం సినిమా కంటెంట్ మాత్రమే ఇస్తాం.. రష్ ఇవ్వం కదా ? అలాంటప్పుడు కొత్తగా ఎడిటింగ్ ఏం చేస్తారని ప్రశ్నించారు.
ఏజెంట్ సినిమా ఓటీటీలోకి రావడానికి ఎందుకు ఆలస్యమౌతుందో తనకు తెలియదని… తాను సినిమాను ఇప్పటికే అమ్మేశానని.. అది ఎప్పుడు ? ఓటీటీలోకి వస్తుందనే అంశంతో తనకు సంబంధం లేని అంశమని చెప్పారు. ఏదేమైనా ఈ మాటలు అఖిల్ పరువు నిజంగానే తీసేసినట్లయ్యింది. పాపం ఏజెంట్ సినిమా అఖిల్‌కు చాలా అవమానాలు మిగిల్చిపోయింది.