Moviesఆ విషయంలో ఎన్టీఆర్ కే గట్టి పోటి ఇస్తున్న రష్మిక మందన్న.....

ఆ విషయంలో ఎన్టీఆర్ కే గట్టి పోటి ఇస్తున్న రష్మిక మందన్న.. అమ్మడులో ఈ టాలెంట్ కూడా ఉందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ .. ప్రజెంట్ ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకుని ఉన్నారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకున్నప్పటినుంచి గ్లోబల్ స్థాయిలో తారక్ పేరు పాపులారిటీ దక్కించుకుంటుంది . ఈ క్రమంలోనే తారక్ కి ఓ విషయంలో గట్టి కాంపీటీషన్ ఇవ్వబోతుంది నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక అంటూ ప్రచారం జరుగుతుంది.

మనకు తెలిసిందే ఎన్టీఆర్ ఒకటి కంటే ఎక్కువగా భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు . ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం బయటపడింది . అయితే ఇప్పుడు రష్మిక లోను అదే టాలెంట్ ఉంది అంటూ బయటపెట్టారు అభిమానులు . రీసెంట్గా చిట్ చాట్ లో పాల్గొన్న రష్మికను మీకు ఎన్ని భాషలు మాట్లాడగలరు అంటూ ప్రశ్నించారు..? అభిమాని. ఈ క్రమంలోనే తాను మొత్తం ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలను అంటూ చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలోనే నెటిజెన్ ఒకసారి తెలంగాణ యాశ లో మాట్లాడండి అని అడగ్గా రష్మిక సెకండ్ కూడా ఆలోచించకుండా చాలా యాక్టివ్ గా మాట్లాడేసింది. ” నమస్తే.. ఎట్లుండురు..మస్తుంది..నీ యమ్మ ..ఏందిరా బై ఇది..”.. అంటూ బ్యాక్ టు బ్యాక్ పవర్ఫుల్ మాటలతో సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . ఈ క్రమంలోనే మిగతా హీరోయిన్స్ కు అన్ని భాషలు రావని .. ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ లో రష్మిక కు ఒక్కటే అన్ని భాషలు వచ్చు అని.. ఈ విషయంలో ఎన్టీఆర్ కి గట్టి కాంపిటీషన్ ఇస్తుంది రష్మిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు దేవర సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా రష్మిక ను చూస్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news