Moviesప్ర‌భాస్ - అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌... ఒక‌టి కాదు.. రెండు...

ప్ర‌భాస్ – అనుష్క ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌… ఒక‌టి కాదు.. రెండు సినిమాలు..!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – అనుష్క కాంబినేషన్ టాలీవుడ్ సినిమా చరిత్రలోనే మంచి హిట్ ఫెయిర్. వీరిద్దరి కాంబినేషన్లో మిర్చి, బిల్లా, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు సినిమాలు సూపర్ హిట్. అందుకే ఈ జోడి తెలుగు ప్రేక్షకులపై జరిగిన ముద్ర వేసింది. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. అనుష్క మాత్రం సైజ్ జీరో సినిమా తర్వాత ఏకంగా సినిమాలకు దూరమైన పరిస్థితి.

ఆ సినిమా తర్వాత ఆమె ఫిజిక్ పూర్తిగా మారిపోయింది. భాగమతి సినిమా ఓ మోస్త‌రుగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె నవీన్ పోలిశెట్టితో ఒక సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తర్వాత ఆమె సినిమా కెరియర్ కు పుల్‌స్టాప్ పెడుతుందని వార్తలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇలాంటి టైంలో తాము మరొకసారి ప్రభాస్ – అనుష్క జోడిని వెండితెరపై అసలు చూస్తామా అన్న బాధతో చాలామంది అభిమానులు ఉన్నారు.

అలాంటివారికి అదిరిపోయే న్యూస్ వచ్చింది. డైరెక్టర్ మారుతి – ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలకపాత్రకు అనుష్క‌ను తీసుకున్నాడుట మారుతి. ఈ పాత్రతో ఈ సినిమా మలుపు తిరుగుతుందని.. మారుతి అడిగిన వెంటనే అనుష్క ఓకే చెప్పిందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

ఇదిలా ఉంటే అనుష్క – ప్రభాస్ కాంబినేషన్లో మరో సినిమా తీసేందుకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కూడా ఓ కథను రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను బాహుబలి నిర్మాతలైన శోభు యార్ల‌గడ్డ – ప్రసాద్ దేవినేని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు సెట్ అయితే మరో రెండు సార్లు ప్రభాస్ – అనుష్క జోడిని వెండితెరపై చూడొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news