Movies"దేవర" సినిమా లో అల్లు అర్హ.. ఎన్టీఆర్ తో ఎలాంటి రోల్...

“దేవర” సినిమా లో అల్లు అర్హ.. ఎన్టీఆర్ తో ఎలాంటి రోల్ చేస్తుందో తెలిస్తే.. గాల్లో ఎగిరిపోవాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించిన పిల్లలు తమ బెర్త్ లను కన్ఫర్మ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న హీరోల కూతుర్లు కొడుకులు ఇండస్ట్రీలోకి రావడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని హీరోయిన్ అవుతానని.. హీరోయిన్గా సినిమాలు చేయాలనుకుంటున్నానని అఫీషియల్ గానే ప్రకటించింది . మహేష్ బాబు సైతం సితార చదువు అయిపోయిన తర్వాత తనకు ఇష్టం వచ్చిన విధంగా తన లైఫ్ని చూస్ చేసుకుంటుంది అని క్లారిటీ ఇచ్చాడు .

అంతే కాదు అల్లు అర్జున్ కూతురు ఏకంగా మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకుంది . సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శాకుంతలం సినిమాలో అల్లు అర్హా కీ రోల్ ప్లే చేసింది. నిజానికి శకుంతల దేవి పాత్రులో నటించిన సమంతకంటే ..దుష్యంతుడి పాత్రలు నటించిన దేవ్ మోహన్ కంటే.. భరతుడి పాత్రలో నటించిన అల్లు అర్హనే అందరిని ఆకట్టుకునింది . ఈ సినిమాకి కాస్తో కూస్తో కలెక్షన్స్ వచ్చాయి అంటే కారణం అల్లు అర్హ..అన్న సంగతి మనం మర్చిపోకూడదు .

అయితే అల్లు అర్హ మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఎస్ టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . అయితే జాన్వి కపూర్ చిన్నప్పటి పాత్ర కోసం అల్లుఅర్జున్ కూతురిని చూస్ చేసుకున్నారట ఎన్టీఆర్. దీనిపై బన్నీని కూడా సంప్రదించక బన్నీ సెకండ్ కూడా ఆలోచించకుండా ఓకె చేసారట. మనకు తెలిసిందే బన్నీ – తారక్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు . బావ బావ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. మరి అలాంటి స్టార్ హీరో సినిమాలో తన కూతుర్ని నటింపచేస్తున్నందుకు ఫ్యాన్స్ కి ఎంత హ్యాపీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు . ప్రెసెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు నందమూరి – అల్లు ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news