సినిమా ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ మధ్య కాలంలో వరుసగా బ్యాక్ టూ బ్యాక్ విషాద వార్తలు వింటున్న సినీ జనాలకు మరో విషాద వార్త వినిపించింది. స్టార్ నటి కన్ను మూసింది. హిందీ, మరాఠీ సినిమాల్లో తన నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న అలనాటి మేటీ నటి పద్మశ్రీ సులోచన లత్కర్ ఆదివారం హాస్పిటల్ లో చికిత్స్ తీసుకుంటూ కన్నుమూశారు.
నటి సులోచన లట్కర్ జూలై 30, 1928న బెల్గాంలోని చికోడి తాలూకా ఖడక్లారత్ గ్రామంలో జన్మించారు. 94 సంవత్సరాల సులోచన లట్కర్ వృద్ధాప్యం కారణంగా ముంబైలోని సుశ్రుషా ఆసుపత్రిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. ఆమె తన సినీ కెరీర్ లో ఎంతో మంది స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. నటి సులోచన లట్కర్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, దిలీప్ కుమార్ వంటి ప్రముఖ నటులతో సినిమాలో చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది,
1943లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టీన ఆమె మరాఠీ, హిందీ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి ఎన్నో అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. కటీపతంగ్, దిల్ దేకో దేఖో , గోరా ఔర్ కాలా వంటి పలు సినిమాలలో ఆమె చేసిన పాత్రలు చిరస్మరణీయంగా మారాయి అంటే దానికి మెయిన్ రీజన్ ఆమె నటనే. ‘సంగత్యే ఐకా’, ‘మోల్కారిన్’, ‘మరాఠా తిటుకా మేల్వావా’, ‘సాది మానసం’, ‘ఏక్తి’ సులోచనా దీదీ కెరీర్‌లో మరపురాని చిత్రాలుగా మిగిలిపోయాయి. మరాఠీలో 50, హిందీలో 250 సినిమాలు చేశాడు. సులోచన దీదీకి 1999లో ‘పద్మశ్రీ’, 2009లో ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డులు లభించాయి. జీవితకాల సాఫల్య అవార్డు కూడా పొందారు. సులోచన మృతి పట్ల పలువురు సీనియర్ నటీనటులు, సన్నిహితులు సంతాపం ప్రకటించారు. .ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు..!!