Moviesబిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా..ఈసారి హౌస్ లో అది...

బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా..ఈసారి హౌస్ లో అది కూడా.. మిడ్ నైట్ కూడా రచ్చ రంబోలాయే..!!

బుల్లితెర టెలివిజన్ పై అతిపెద్ద రియాలిటీ షో గా స్టార్ట్ అయిన షో బిగ్ బాస్ . పలు భాషల్లో సూపర్ సక్సెస్ అయిన ఈ బిగ్ బాస్ తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అయింది . మరీ ముఖ్యంగా ఇప్పటివరకు ఆరు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ త్వరలోనే ఏడవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది . అయితే ఈసారి నాగార్జున ఈ షో హోస్టింగ్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది . ఆ ప్లేస్ లోకి రానా దగ్గుబాటి లేదా నందమూరి బాలయ్య హోస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈసారి బిగ్ బాస్ లో పూర్తిగా రూల్స్ కూడా మార్చేశారట . అప్పట్లో ఎలిమినేషన్ వెంటనే కంటెస్టెంట్ ని బయటికి పంపించేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మార్చేసారట. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ తో కూడా టీఆర్పీలు సంపాదించడానికి సరికొత్త టాస్క్లు క్రియేట్ చేశారని ..అంతేకాకుండా ఈసారి డివోర్స్ తీసుకున్న జంటను సీక్రెట్ రూమ్ లో పెట్టి షో ని కొత్త మలుపు తిప్పబోతున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అంతే కాదు రెమ్యూనరేషన్ పరంగా కూడా ఈసారి భారీ స్థాయిలోనే ఖర్చు చేసి స్టార్ సెలబ్రెటీస్ ని ప్రముఖ సింగర్స్ ని బిగ్ బాస్ లోకి అడుగు పెట్టేలా చేయబోతున్నారట . మరీ ముఖ్యంగా ఈసారి అన్నిటికన్నా హైలైట్ ఏంటంటే ..మిడ్ నైట్ కూడా టాస్క్ ఇచ్చి ఆ టాస్క్ ను లైవ్ లో బిగ్ బాస్ మేనేజ్మెంట్ చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ ఒక గంట టెలికాస్ట్ అయ్యేలా ఉండింది . అయితే ఈసారి మిడ్ నైట్ కూడా ఓ గంట టెలికాస్ట్ అయ్యేలా కొత్తగా థింక్ చేస్తున్నారట . దీంతో ఇక హౌస్ లో రాత్రి కూడా ఏం జరుగుతుందో జనాలు ఈజీగా చూసేయొచ్చు. దీంతో ఈసారి బిగ్ బాస్ పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news