పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా జూన్ 16న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ప్రభాస్ సినిమా అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో ఈ సినిమా తొలి రోజే భారీ వసూళ్లను రాబట్టింది. కేవలం సౌత్ లోనే కాకుండా హిందీలోనూ అత్యధిక కలెక్షన్ లను రాబట్టినట్టు తెలుస్తోంది.
తొలిరోజు వచ్చిన లెక్కల ప్రకారం ఆది పురుష్ హిందీలో మొదటి రోజు రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ సినిమా తర్వాత ఆదిపురుష్ హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో అత్యధికంగా వసూలు రాబట్టినట్టు సమాచారం. అదేవిధంగా ఈ సినిమా ఇతర భాషలలో కూడా 50 కోట్లను రాబట్టింది.
ఇక ఓవరాల్ గా ఇండియా వ్యాప్తంగా మొదటి రోజు రూ.120 నుండి రూ.140 కోట్ల వసూళ్లు రాబట్టినట్టు తెలుస్తోంది. ఈరోజు రేపు వీకెండ్ కావడంతో కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీకెండ్ లో ఈ చిత్రానికి రూ.250 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో కరోనా తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ వచ్చిన సినిమాలలో ఆది పురుష్ పేరు నమోదయ్యింది.
అదేవిధంగా వారాంతపు వసూళ్ల పరంగా కూడా ఆది పురుష్ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా వరల్డ్ వైడ్ గా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదిపురుష్ సినిమా మొత్తంగా 6200 స్క్రీన్ లలో విడుదలయ్యింది. అందులో హిందీలోనే ఏకంగా నాలుగువేల స్క్రీన్లలో ఈ సినిమా విడుదల అయింది. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సినిమా తొలి రోజు భారీగానే వసూళ్లను రాబట్టింది.
నైజాంలో 18 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అదేవిధంగా విశాఖపట్నంలో రూ.125 కోట్లు, ఈస్ట్ లో ఎనిమిది కోట్లు, వెస్ట్‌లో రు. 7 కోట్లు, కృష్ణా జిల్లాలో 7.5 కోట్లు, గుంటూరులో 9 కోట్లు, నెల్లూరులో నాలుగు కోట్లు, సీటేడ్ లో 17.5 కోట్లు కొల్లగొట్టినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.