Moviesసినిమాలు లేక‌పోయినా అంజ‌లికి ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వ‌చ్చాయ్‌..!

సినిమాలు లేక‌పోయినా అంజ‌లికి ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వ‌చ్చాయ్‌..!

టాలీవుడ్ లో చాలా తక్కువ మంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా నటించారు. అలా నటించిన లిస్టులో హీరోయిన్ అంజలి కూడా ఒకరు. అయితే అంజలి హీరోయిన్ గా నటించినప్పటికీ స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయింది. అందం అభినయం ఉన్నప్పటికీ కావాల్సినంత గ్లామర్ వడ్డించినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకోలేకపోయింది. అంతేకాకుండా కుర్ర హీరోల కంటే సీనియర్ హీరోలతోనే ఎక్కువ సినిమాలు చేసింది.

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ కు భార్య పాత్రలో అంజలి నటించింది. అంజలి మొదటగా షాపింగ్ మాల్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ చిత్రాలలో కూడా నటించింది. దాంతో బొద్దుగా ఉండే అంజలికి తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ మంది ఫ్యాన్స్ అయ్యారు. ప్రస్తుతం సినిమాలతో పాటు అంజలి వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.

అంజలి చేసింది తక్కువ సినిమాలు అయినా…. అందుకుంది తక్కువ రెమ్యునరేషన్ అయినప్పటికీ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఆస్తులు సంపాదించిందినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా అంజలి సంపాదించినట్టు తెలుస్తోంది. హైదరాబాదులోనే కాకుండా చెన్నైలో కూడా ఆస్తులను కూడా పెట్టినట్టు తెలుస్తోంది. చెన్నై హైదరాబాద్ లో అంజలికి మొత్తం 200 కోట్ల విలువ చేస్తే ఆస్తులు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే అంజలి గతంలో తన కుటుంబ సభ్యులతో గొడవలు పడిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఆస్తుల పంపకాల విషయంలోనే గొడవలు జరిగినట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయం కోర్టుమెట్ల వరకు వెళ్ళింది. కానీ ఆ తర్వాత అంజలి గురించి …వారి కుటుంబ సభ్యుల గొడవల గురించి ఎటువంటి వార్తలు వినిపించలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news