Moviesజూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ఆరాధిస్తా... వారాహి యాత్ర‌లో ప‌వ‌న్ సంచ‌ల‌నం..

జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను ఆరాధిస్తా… వారాహి యాత్ర‌లో ప‌వ‌న్ సంచ‌ల‌నం..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస క్రేజీ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా కొనసాగుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ బ్రో సినిమా షూటింగ్ ముగించుకొని హరీష్ శంకర్, సుజిత్ సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇదే సమయంలో రీసెంట్ గా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను కూడా ప్రారంభించాడు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఈ యాత్ర కొనసాగుతుంది.

ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ అధికార పార్టీపై తనదైన రీతిలో విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. ఇదే క్ర‌మంలో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జరిగిన రోడ్ షోలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తన పేరు మీద ఎప్పుడు ఫ్యాన్ క్లబ్బులు లేవని, అంతేకాకుండా గత రెండు దశాబ్దాలుగా నేను ఎలాంటి బ్రాండ్‌లను ఎండార్స్ చేయలేదని కూడా అన్నారు.

అలాగే చిత్ర పరిశ్రమలో ఉన్న తన తోటి న‌టలు అంటే కూడా తనకు చాలా ఇష్టమని… అలాగే వారి సినిమాలు తరచూ చూస్తాను… సినిమా అనేది రాజకీయాలకు ఎంతో భిన్నంగా ఉంటుందని అన్నారు.
ఇక మీకు ఏ నటుడినైనా ప్రేమించే స్వేచ్ఛ ఉంటుంది. అయితే మీరు ఏకాభిప్రాయంతో ఉంటే బాగుంటుందని పవన్ చెప్పుకొచ్చారు.

అలానే చిత్రపరిశ్రమలో ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయనతో సినిమా చేయాలని ఉందని పవన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో మెగా కుటుంబానికి, నందమూరి కుటుంబానికి గత నాలుగు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఈ రెండు కుటుంబాలు పోటీ పడుతూనే ఉన్నాయి. అలాంటి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ అంటే తనకు ఇష్టమని చెప్పడంతో ఒకసారి అందరు షాక్ అయ్యారు.

దీంతో మరోసారి పవన్ కళ్యాణ్- ఎన్టీఆర్ కలిసి సినిమా చేస్తారనే దానిపై కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవన్ ఒకేసారిగా ఎన్టీఆర్ పై తన ప్రేమను కురిపించడంతో రాజకీయంగా కూడా ఇది హాట్ టాపిక్ గా మారింది. రాబోయే రోజుల్లో పవన్ ఎన్టీఆర్ రాజకీయం ఎలా ? ఉంటుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news