మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ గురించి, ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె టాలీవుడ్ దివంగత స్టార్ నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య కుమార్తె. అలాగే చిరంజీవి చిన్న తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ నటుడు కావడంతో ఆయన వివాహాలు, భార్యల గురించి ఎప్పుడూ వార్తలు వస్తూ ఉంటాయి. కానీ చిరంజీవి రెండో తమ్ముడు నాగబాబు భార్య పద్మజ గురించి పెద్దగా ఎవరికి ఏమీ తెలియదు.
29 సంవత్సరాల వయసులో నాగబాబుకు పద్మజతో వివాహం జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. నాగబాబు తల్లి అంజనాదేవి పాలకొల్లులో వారి బంధువుల పెళ్ళిలో పద్మజను మొదటిసారిగా చూశారట. మొదటి చూపులోనే పద్మజ అంజనాదేవిని ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. ఆమె నా రెండో కొడుకు భార్య అయితే బాగుంటుందని మనసులోనే అనుకుందట. వెంటనే అంజనాదేవి పద్మజ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని. వారిది మంచి కుటుంబం కావడం.. ఆమె కూడా చిన్నప్పటి నుంచి ఎంతో పద్ధతిగా పెరిగిందని తెలియడంతో నాగబాబు భార్యగా ఆమెని ఫిక్స్ అయిపోయారట.
అంతేకాకుండా నాగబాబుతో పాటు ఇంట్లో వారందరికీ కూడా పద్మజ ఎంతో నచ్చిందట. వెంటనే పెళ్లి సంబంధం మాట్లాడుకుని వెంటనే నాగబాబు- పద్మజకు తక్కువ టైంలోనే వివాహం కూడా జరిపించారు. నాగబాబు తో పెళ్లి తర్వాత పద్మజ ఓ సంపూర్ణ గృహిణిలా మారిపోయింది. నాగబాబుకు కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ ఆయనను అన్నీ తానై చూసుకుంది. ఈ దంపతులకు వరుణ్ తేజ్, నిహారిక జన్మించారు. నిహారికకు ఆల్రెడీ పెళ్లి అవ్వగా.. వరుణ్ తేజ్‌కు త్వారలోనే లావణ్య త్రిపాఠి తో ఏడడుగులు వేయబోతున్నాడు.
అన్నట్లు పద్మజ గురించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆమెచిన్నప్పటినుంచి కూడా మెగాస్టార్ చిరంజీవికి విరాభిమాని అట. చిరంజీవికి సంబంధించిన అనేక పేపర్ కటింగ్స్ ను ఈమె సేకరించి వాటిని బుక్కు లాగా కూడా తయారు చేసుకుందట. పెళ్లికి ముందు ఈ క్లిప్పింగ్స్ బుక్ చూసి అంజనాదేవి తెగ మురిసిపోయారట. మొత్తానికి అభిమాన హీరోకు మరదలిగా పద్మజ మెగా ఇంటి కోడలిగా వెళ్లిందన్నమాట.