రమ్యకృష్ణ ..ఒకప్పుడు పెద్ద ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ తగిలించుకున్న నటి. ఆమె కెరీర్ ప్రారంభంలో చేసిన సినిమాలన్నీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఇక రమ్యకృష్ణ కెరీర్ ఢమాల్ అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాఘవేంద్ర రావు దృష్ఠి పడింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో వరుసగా ఛాన్స్ ఇస్తూ వచ్చారు.
ఆ సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్ ను సాధించాయి. దాంతో ఒక్కసారిగా రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ అందుకుంది. ఐరెన్ లెగ్ అనుకున్న రమ్యకృష్ణ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుందంటే రాఘవేంద్ర రావు ఒక్కసారిగా రమ్య ఫేట్ ని ఎలా మార్చారో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా రమ్యకృష్ణలో సెక్స్ అపీల్ ఆమె బొడ్డు. ఇది యాపిల్ పండులాగా ఉంటుందని రాఘవేంద్రరావు తీసిన ప్రతీ సినిమాలో చూపించి చెప్పారు. రమ్యకృష్ణ ని అసలు పనికిరాదనుకున్నవారే ఆమెకి అభిమానులుగా మారారంటే ఎంత రొమాంటిక్ గా ఫీలవకపోతే అలా అనుకుంటారు. ఇదంతా దర్శకేంద్రుడి చలువే. రమ్యక్రిష్ణ లో ఉన్న సెక్స్ అపీల్ బొడ్డు మీదే ఎక్కువగా దృష్టిపెట్టారు.
ఆ బొడ్డును ఎంత అందంగా చూపించాలో అంతకన్నా అందంగా చూపించి రమ్యకృష్ణ అందగత్తే మాత్రమే కాదు అద్భుతమైన పర్ఫార్మర్ కూడా సినీ లవర్స్ కి తెలిసేలా చేశారు. అందుకే ఇప్పటికీ రమ్యకృష్ణ అంటే విపరీతంగా క్రేజ్ ఉంది. నరసింహ సినిమాలో చేసిన నీలాంబరి పాత్ర బాహుబలి సిరీస్ లో చేసిన శివగామి పాత్ర ఆమె కెరీర్ ని ఇంకో స్థాయికి తీసుకెళ్ళాయి. ఇక రమ్యకృష్ణ అదే గ్లామర్ ని మేయింటైన్ చేయడం ఏజ్ కి తగ్గ క్యారెక్టర్స్ ఎంచుకోవడం గొప్ప విషయం.