Moviesమళ్ళీ అదే తప్పు చేస్తున్న కృతి శెట్టి.. ఈసారి ఆ దేవుడు...

మళ్ళీ అదే తప్పు చేస్తున్న కృతి శెట్టి.. ఈసారి ఆ దేవుడు కూడా కాపాడలేడా..?

పాపం కృతి శెట్టి ..తెలిసి చేస్తుందో ..తెలియక చేస్తుందో తెలియదు కానీ ..తెలిసి తెలియక తనంతో చేసిన తప్పులు ..తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కారణంగా చాలా బాధపడుతుంది . మరీ ముఖ్యంగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత నటించిన నాని శ్యామ్ సింగరాయ్.. నాగచైతన్య బంగార్రాజు కూడా హిట్ అయ్యాయి.

దీంతో ఇండస్ట్రీలో ఆమె అదృష్ట దేవతగా భావించారు . అయితే ఆ తర్వాత నటించిన నాలుగు సినిమాలు ఫ్లాప్ అవడంతో అమ్మడు ముఖాన్ని చూడడం మానేశారు . అయినా సరే కోలీవుడ్ లో బాగానే అవకాశాలు వస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే కృతి శెట్టి మళ్ళీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది అని .. తప్పుడు మార్గంలో వెళ్తుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . దానికి మెయిన్ రీజన్ నితిన్ తో మరో సినిమాను యాక్సెప్ట్ చేయడమే అంటూ తెలుస్తుంది .

ఆల్రెడీ నితిన్ తో మాచర్ల నియోజకవర్గం అనే సినిమా తీసి డిజాస్టర్ ని అందుకుంది. పరమ చెత్త జోడిగా రికార్డు నెలకొల్పింది. అయితే మళ్ళీ నితిన్తో సినిమాకు సైన్ చేయడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటి సంపాదించుకున్న నితిన్ వెంకీ కుడుముల డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన మొదటి హీరోయిన్ గా నటిస్తుంది రెండవ హీరోయిన్గా కృతి శెట్టి సెలెక్ట్ అయిన్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలోనే కృతిశెట్టి ఫ్యాన్స్ ఆమెను ఏకిపారుస్తున్నారు. సెకండ్ హీరోయిన్గా చేయాల్సిన అవసరం ఏముంది..? పైగా రష్మిక మందన లాంటి హీరోయిన్ ఉండగా నిన్నెవరు చూస్తారు..? తప్పుడు నిర్ణయం తీసుకున్నవ్ కృతి అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news