Moviesఎన్టీఆర్ కు భార్యగా స్టార్ హీరోయిన్.. అఫిషియల్ అప్డేట్ ఇచ్చిన దేవర...

ఎన్టీఆర్ కు భార్యగా స్టార్ హీరోయిన్.. అఫిషియల్ అప్డేట్ ఇచ్చిన దేవర టీం..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రిలో ఎక్కడ చూసినా సరే దేవర సినిమాకి సంబంధించిన న్యూస్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తెరపై కనిపించి చాలా ఏళ్లు అయిపోతుంది . అప్పుడెప్పుడో ఆర్ఆర్ఆర్ సినిమాతో హిట్ కొట్టిన తారక్ ఆ తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరి దేవర సినిమా షూట్ ను ప్రారంభించారు . అయితే ఎంత టైం గ్యాప్ తీసుకున్న షూట్ ను మాత్రం త్వరగా ఫినిష్ చేస్తున్న ఎన్టీఆర్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.

ఇలాంటి క్రమంలోనే దేవర సినిమాకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ అవుతూ సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే . గత 48 గంటల నుంచి ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి కూడా నటించబోతుంది అని .. ఎన్టీఆర్ భార్యగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపించాయి .

ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవ్వడంతో ఎన్టీఆర్ టీం స్పందించింది . ఈ సినిమాలో సాయి పల్లవి నటిస్తుంది అనేది బిగ్ రూమర్ అంటూ అలాంటి వార్తలకు చెక్ పెట్టింది. అయితే సెకండ్ హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. రష్మిక మందన్నా.. మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్న ఇంకా ఫైనలైజ్ కాలేదు అన్నట్లు సమాచారం అందుతుంది. అంతేకాదు సెకండ్ హీరోయిన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని.. ఏ హీరోయిన్ ఆ అదృష్టాన్ని దక్కించుకుంటుందో అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news