మహానటి సావిత్రి.. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా.. తమిళ సినిమా రంగంలోనూ అనేక పాత్రలు పోషించా రు. ఒకానొక దశలో ఆమె తెలుగు కంటే కూడా.. తమిళంలోనే బిజీ అయ్యారు. అలాంటి సావిత్రి బాగానే డబ్బు కూడా సంపాయించుకున్నారు. నిజానికి ఇప్పుడు ఒక సినిమా హిట్టయితే.. వెంటనే హీరోలు, హీరోయిన్లు తమ రెమ్యునరేషన్‌ను కొట్లలో పెంచేస్తున్నారు. ఇది ఇప్పటి ట్రెండ్. కానీ, పూర్వం రోజుల్లో అలా ఉండేది కాదు.
ఏడాది పాటు ఒకే రెమ్యూనరేషన్ తీసుకోవాలని.. నిర్మాతల మండలి, దర్శకులు చేసిన విధానాలను హీరో లు, హీరోయిన్లు పాటించేవారు. అది ఎంత పెద్ద హిట్ సినిమా అయినా.. కూడా రెమ్యునరేషన్లలో ఎలాంటి తేడాలు ఉండేవి కాదు. ఏడాదికి ఒకసారి మాత్రం పెంచుకునేవారు. ఇలా.. సావిత్రి పెంచుకున్న రెమ్యున రేషన్‌తో ఇద్దరు హీరోయిన్లతో నటింప చేయొచ్చనే టాక్ కూడా ఉండేది.
ఒక సందర్భంలో దర్శకులు.. అయితే.. ఈ సొమ్ము తాగి తగలేయడమేగా..! అని కామెంట్లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే.. అన్నగారు ఎన్టీఆర్ ఇలాంటి కామెంట్లను హర్షించేవారు కాదు. రెమ్యునరేషన్ అనేది.. నటికి ఇస్తున్న గౌరవం.. కళామతల్లికి ఇస్తున్న గౌరవంగా చూడాలని.. రెమ్యునరేషన్ ఫ్రీగా ఇచ్చేవారు కాదు కదా..! అని ప్రశ్నించేవారు.
దుబారా అనేది ఎవరి ఇష్టం వారిదని వ్యాఖ్యానించేవారు. సావిత్రి మాత్రం ఎవరు ఏమని అనుకున్నా..తను మాత్రం తీసుకున్న సొమ్ముతో పార్టీలు.. విందులు ఏర్పాటు చేసేవారు. సాయంత్రం అయితే.. మద్రాస్ క్లబ్‌లో సావిత్రి స్నేహితులు నిండిపోయేవారు. ఇదీ.. సంగతి! చివరకు ఏం జరిగిందో తెలిసిందే కదా..! సావిత్రి తన కెరీర్ చివరి దశలో ఎన్ని కష్టాలు పడి.. ఎంతదీన స్థితిలో మృతిచెందిందో చూశాం.