Moviesచిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది.. ఎవ‌రు ఇచ్చారో తెలుసా..!

చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది.. ఎవ‌రు ఇచ్చారో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చి ఎన్నో కష్టాలు పడిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే హీరోగా అవకాశం దక్కించుకున్నాడు. ఎన్నో సినిమాలో న‌టించి తనదైన స్టైల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన యాక్టింగ్, డాన్స్ తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని ప్రయత్నించే చాలామంది యంగ్ హీరోల‌కు ఆదర్శంగా నిలిచారు.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది స్టార్ హీరోస్ చిరంజీవి స్ఫూర్తితోనే ఇండస్ట్రీలోకి వచ్చామని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చిరంజీవి తన కెరియర్ స్టార్టింగ్ లో విలన్ రోల్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా న‌టించిన తర్వాత స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా చిరంజీవికి చాలా బిరుదులు ఉన్నాయి. మెగాస్టార్‌, సుప్రీమ్, డైన‌మిక్ హీరో పాపుల‌ర్ బిరుదులు.

చిరుకు మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఒక వెలుగు వెలిగిన కేఎస్ రామారావు చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం ఐదు సినిమాలు రాగా మొదటి సినిమా అభిలాష అప్పట్లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసింది. తర్వాత వచ్చిన ఛాలెంజ్, రాక్షసుడు మూవీస్ కూడా సూపర్ హిట్ నిలిచాయి.

రాక్షసుడు సినిమా ద్వారానే నాగబాబు కూడా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అయితే కేఎస్ రామారావు – చిరంజీవి కాంబోలో వచ్చిన నాలుగవ సినిమా మ‌ర‌ణ‌ మృదంగం. ఈ సినిమాలో చిరంజీవి పేరు మొదట మెగాస్టార్ అనే టైటిల్ తో కనిపించింది. అయితే ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు అంతగా హిట్ కాకపోయినా మెగాస్టార్ అనే బిరుదు మాత్రం అలానే నిలిచిపోయింది. అప్ప‌టి నుంచి చిరు మెగాస్టార్ అయిపోయాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news