Moviesసెన్షేష‌న‌ల్ న్యూస్‌... కీర్తి సురేష్ ప్రేమ‌లో నాగ‌చైత‌న్య‌... శోభిత ధూళిపాళ్ల‌తో క‌టిఫ్...

సెన్షేష‌న‌ల్ న్యూస్‌… కీర్తి సురేష్ ప్రేమ‌లో నాగ‌చైత‌న్య‌… శోభిత ధూళిపాళ్ల‌తో క‌టిఫ్ ?

ఈ టైటిల్ చూసిన వెంట‌నే ఒక్క‌సారిగా సెన్షేష‌న‌ల్‌గా క‌నిపిస్తుంది. అదేంటి నాగ‌చైత‌న్య ఇప్పుడు కొత్త‌గా కీర్తిసురేష్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతున్నాడా ? అన్న డౌట్లు వ‌స్తాయి. నాగ‌చైత‌న్య ముందుగా స్టార్ హీరోయిన్ స‌మంత‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. నాలుగేళ్ల ప్రేమ త‌ర్వాత పెళ్లి చేసుకుని మ‌రో నాలుగేళ్ల పాటు కాపురం చేసుకున్నారు.

ఆ త‌ర్వాత ఇద్ద‌రూ విడిపోయారు. ఇప్పుడు ఎవ‌రి దారి వారు చూసుకుంటున్నారు. ఇక గ‌త యేడాది కాలంగా చైతు .. తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతున్నాడ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రు క‌లిసి జంట‌గా విదేశాల్లో కూడా క‌నిపిస్తున్నారు. ఇక త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌న్న ప్ర‌చార‌మూ జ‌రిగింది.

అయితే ఇప్పుడు అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. చైతు మ‌రో హీరోయిన్ కీర్తి సురేష్‌ను ప్రేమిస్తున్నాడ‌ట‌. అయితే ఇది నిజంగా కాదు వెండితెర మీద మాత్ర‌మే. నిజంగానే వెండితెర‌పై కీర్తి సురేష్‌, నాగ‌చైత‌న్య ప్రేమ‌లో ప‌డ‌బోతున్నారు. నాగచైతన్య – చందూ మెండేటి కాంబినేషన్‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ తెరకెక్కిస్తోంది.

సూరత్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథలో చైతూ బోట్‌ డ్రైవర్‌గా నటిస్తున్నాడట. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అనుపమ పరమేశ్వరన్‌, కీర్తి సురేశ్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. చివరికి కీర్తి సురేష్‌ పేరు ఖాయం చేసినట్టు తెలిసింది. చైతూ – కీర్తి కలిసి నటించడం ఇదే తొలిసారి. నాగచైతన్య – చందూల కాంబోలో గ‌తంలో వ‌చ్చిన‌ ‘ప్రేమమ్‌’ మంచి విజయాన్ని అందుకొంది. ఇక సవ్యసాచి ఫ్లాప్‌గా మిగిలింది. మరి మూడో సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news