Movies' భ‌గ‌వంత్ కేస‌రి ' టాక్ బ‌య‌ట‌కొచ్చింది... ఇండ‌స్ట్రీ అంతా ఒక్క‌టే...

‘ భ‌గ‌వంత్ కేస‌రి ‘ టాక్ బ‌య‌ట‌కొచ్చింది… ఇండ‌స్ట్రీ అంతా ఒక్క‌టే మాట‌…!

ఈ యేడాది సంక్రాంతికి వీరసింహా రెడ్డి మూవీతో పెద్ద సక్సెస్ సొంతం చేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యువ దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మ‌రో యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల కూడా కీలక పాత్ర చేస్తోంది. అఖండ‌, వీర‌సింహారెడ్డి లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ల త‌ర్వాత బాల‌య్య న‌టిస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు.

రీసెంట్గా భ‌గ‌వంత్ కేస‌రి అన్న టైటిల్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. టైటిల్‌తో పాటు రిలీజ్ అయిన టీజ‌ర్ అయితే ఒక్క‌సారిగా టాలీవుడ్‌ను షేక్ చేసి ప‌డేసింది. సినిమా ట్రైల‌ర్‌, సాంగ్స్ ఎప్పుడు వ‌స్తాయా ? సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అన్న ఆశ‌లు ఒక్క‌సారిగా క‌లుగుతున్నాయి. ఇక ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా అక్టోబర్ 20న విడుదల కానుంది.

ఇక ఈ సినిమా ఎలా ? ఉండ‌బోతోందా ? అన్న‌దానిపై ఇండ‌స్ట్రీలో ఒక్క‌టే యునాన‌మ‌స్ టాక్ వినిపిస్తోంది. సినిమా అల్టిమేట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కాబోతోంద‌ని చ‌ర్చించుకుంటున్నారు. సినిమా చాలా అంటే చాలా బాగా వ‌చ్చింద‌ని చ‌ర్చించుకుంటున్నారు. సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌బోతోంద‌ని.. ఇంకా చెప్పాలంటే వీర‌సింహారెడ్డిని మించి ఉండబోతోంద‌ని అంటున్నారు.

అన్ని వర్గాల ఆడియన్స్‌ని, ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్‌ని అలరించేలా దర్శకుడు అనిల్ రావిపూడి చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడ‌ట‌. కేవ‌లం టీజ‌ర్‌లోనే బాలకృష్ణ తన నటవిశ్వరూపం తో అదరగొట్టగా.. రేపు సినిమా రిలీజ్ అయ్యాక కూడా భ‌గ‌వంత్ కేస‌రి థియేట‌ర్ల‌లో పెద్ద సక్సెస్ అందుకోవడం కూడా ఖాయమని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news