నిన్నమొన్నటి వరకు వరుణ్ – లావణ్య ప్రేమించుకంటున్నారంటూ వార్తలు వైరల్ అయినా దానిపై స్పందించని వారిద్దరు సడెన్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు. జూన్ 9న ఎంగేజ్మెంట్ రింగ్స్ తొడుక్కొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. తాజాగా లావణ్య త్రిపాఠికి ఓ వ్యాధి ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇదే విషయాన్ని స్వయంగా లావణ్య త్రిపాఠి చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.
చిత్ర పరిశ్రమలో ఉండే చాలామంది హీరోయిన్లు ఎన్నో రకరకాల వింత వ్యాధుల భారిన పడుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే నుంచి సమంత, రష్మిక మందన్నా, శ్రీ లీల వరకు ఎంతో మంది హీరోయిన్లు కొన్ని వింత వింత ఫోబియాలతో ఇబ్బంది పడుతున్న విషయం మనకు తెలిసింది. ఇక రీసెంట్ గానే సమంత మయోసైటిస్ తో ఎలా తయారయిందో కూడా మనం ఇప్పటికే చూశాం.
ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్, కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠికికి కూడా ఎవరు ఊహించని ఓ వింత వ్యాధి ఉందట. ఇదే విషయాన్నిసోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. సాధారణంగా నేను ఎంతో ధైర్యంగా ఉంటాను.. కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో కొన్ని వస్తువులు, కొన్ని ఆకారాలు చూస్తుంటే తెలియకుండానే నాలో భయం వచ్చేస్తుందని చెప్పింది.
ఈ విషయాన్ని డాక్టర్ కి చెబితే నీకు ట్రిపోఫోబియా ఉంది అని చెప్పారంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో మెగాభిమానులు, నెటిజన్లు లావణ్యకు ఉన్న ఈ వింత జబ్బుతో వరుణ్ ఎలా వేగుతాడురా ? బాబు అని కామెంట్లు పెడుతున్నారు.