Moviesగుండు లుక్‌లో షాక్ ఇస్తోన్న ఈమె మ‌హేష్ సినిమా హీరోయిన్... గుర్తు...

గుండు లుక్‌లో షాక్ ఇస్తోన్న ఈమె మ‌హేష్ సినిమా హీరోయిన్… గుర్తు ప‌ట్టారా…!

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన కెరీర్‌లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశారు. ప్రయోగాత్మకమైన సినిమాల్లో కూడా నటించారు. మహేష్ చేసిన సినిమాలలో డిఫరెంట్ మూవీలో టక్కరి దొంగ కూడా ఒకటి. ఈ సినిమాకు జయంత్ పరాంజీ దర్శకత్వం వహించారు. ఇందులో మహేష్ కౌబాయ్‌గా కనిపించినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరైన విజయం అందుకోలేదు. ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం మాత్రం ప్రేక్షకులను మెప్పించింది.

ఈ సినిమాలో మహేష్‌కు జంటగా బాలీవుడ్ భామలు బిపాసాబసు, లిసా రే హీరోయిన్లుగా నటించారు. బిపాసాబ‌సు ఇప్పుడు హిందీ సినిమాల్లో నటించి భారీ క్రేజ్‌ అందుకుంది. మరో హీరోయిన్ లిసా రే కూడా బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది.ఇక లిసా రే తెలుగులో నటించిన ఏకైక సినిమా కూడా టక్కరి దొంగ. ఈ సినిమాలో ఈ అమ్మడి నటన, అందం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈమె భారతీయ నటి కూడా కాదు కెనడియన్ హీరోయిన్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలు సినిమాల్లో నటించింది. అంతేకాకుండా కొన్ని హిందీ షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి మెప్పించింది
ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బుల్లితెరపై పులు షోస్, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్ముడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ ఫోటోల‌తో అందరి దృష్టిని ఆకర్షించడం మాత్రమే కాకుండా అందరికీ కూడా షాక్ ఇచ్చింది.

ఇక అందులో గుండులో లిసా రే ను చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. ఒక మ్యాగజైన్ కోసం ఈ అమ్మడు ఈ సాహసం చేసింది. అది నిజమైనా గుండేనా అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు లిసా రే గుండులో కూడా చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి లిసా రే కొత్త స్టిల్ సోషల్ మీడియాను మాత్రం కుదిపేస్తోంది. ఇక లిసా రే తాజా ఫోటోలు పై మీరు కూడా ఓ లుక్కేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news