సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా తెలుగు బ్యూటీలకి ప్రత్యేక ఆకర్షణ ఉంది అంటుంటారు జనాలు . అయితే ఎందుకో తెలియదు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అసలు అవకాశాలు ఇవ్వరు . కాగా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాల కోసం పక్క భాషకు వెళ్లి అక్కడ సినిమా అవకాశాలు దక్కించుకొని అక్కడి నుంచి వచ్చిన క్రేజ్ తో పాపులారిటీతో తెలుగులో అవకాశాలు దక్కించుకుంటూ ఉంటారు .
ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ అంజలి . పేరుకు తెలుగు అమ్మాయి అయినా కోలీవుడ్లో అవకాశాలు అందుకొని తద్వారా టాలీవుడ్ లో పాపులారిటీ సంపాదించుకొని ఇక్కడ కూడా సినిమా అవకాశాలు అందుకుంది . అయితే మొదటి నుంచి అంజలి చాలా హోమ్లీ పాత్రలో ఎక్కువ చూస్ చేసుకుంటూ వచ్చేది. కానీ సడన్గా అవకాశాలు తగ్గడంతో బోల్డ్ కంటెంట్ పాత్రలు కూడా చూస్ చేసుకుంటూ ఆఖరికి లెస్బియన్ గా కూడా నటించింది .
ఈ క్రమంలోని కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపి అతగాడితో పెళ్లి వరకు వెళ్లి లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసుకున్నింది అన్న రూమర్లు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి . అంతేకాదు అతగాడి కంటే ముందే అంజలి కోలీవుడ్ లో ఓ డైరెక్టర్ తో కమిట్ అయ్యిందని.. అవకాశాల కోసం డబ్బుల కోసమే ఇలా అంజలి బోల్డ్ గా నటించడానికి చీప్ పనులు చేయడానికి కూడా సిద్ధపడింది అని అప్పట్లో ప్రచారం జరిగింది .
ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలు పడడంతో అంజలి తన రూటు మార్చుకొని క్లాస్ అండ్ డీసెంట్ పాత్రను చూస్ చేసుకుంటూ వస్తుంది. అయితే గతంలో చేసిన తప్పు ఇప్పటికే ఆమెను వెంటాడుతూనే ఉంది . ఓ డైరెక్టర్ తో కమిట్మెంట్ ఇచ్చి అవకాశాలు అందుకుంది అని ఇప్పటికీ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి..!!