Moviesబాక్స్ ఆఫిస్ వద్ద బాలయ్య ఊచకోత షురూ… "భగవంత్ కేసరి" టైటిల్...

బాక్స్ ఆఫిస్ వద్ద బాలయ్య ఊచకోత షురూ… “భగవంత్ కేసరి” టైటిల్ వెనుక ఉన్న అసలు అర్ధం తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే..!!

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన నందమూరి బాలయ్య తదుపరి నటిస్తున్న సినిమా కి సంబంధించిన టైటిల్ ని రివీల్ చేశారు మేకర్స్. మనకు తెలిసిందే బాలయ్య కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఎన్బికె 108 . బాలయ్య పుట్టినరోజుకి రెండు రోజుల ముందే అభిమానులకు బర్త్డే ట్రీట్ ఇవ్వడానికి అనిల్ రావిపూడి ఫిక్స్ అయిపోయాడు. కొద్దిసేపటి క్రితమే బాలయ్య ఎన్.బి.కె 108 సినిమాకి సంబంధించిన టైటిల్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్.

కాగా ..”అన్న దిగిండు.. ఇగ మాస్ ఊచకోత షురూ” అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలయ్య నటిస్తున్న సినిమాకి “భగవంత్ కేసరి” అనే టైటిల్ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఈ టైటిల్ కొన్ని రోజులు ముందు నుంచి సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతూనే ఉంది . కాగ ఎట్టకేలకు అదే టైటిల్ ని ఫైనల్ చేశాడు అనిల్ రావిపూడి . ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే బాలయ్య టైటిల్స్ ఏవి కూడా ఇంత మాసివ్ కూల్ క్యాచీ పదాలను యూస్ చేయలేదు .

ఫస్ట్ టైం బాలయ్య తన సెంటిమెంట్స్ ని బ్రేక్ చేసి మరి ఈ సినిమాలో కనిపించబోతున్నాడు అంటూ తెలుస్తుంది . కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్ బాలయ్య సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాయి. కాగా భగవంత్ కేసరి అనే టైటిల్ ని ఈ సినిమాకి పెట్టడానికి మెయిన్ రీజన్ సినిమాలో బాలయ్య పాత్ర పేరు కూడా అదే అంటూ తెలుస్తుంది . కేవలం భగవంత్ కేసరి అనేది టైటిలే కాదు.. బాలయ్య నటించే పాత్ర పేరు కావడం గమనార్హం.

ఆ ఊరిలో బాలయ్య ఓ దేవుడు. కనిపించని ఆ దేవుడిని కాదు కనిపించే ఈ దేవుడిని నమ్ముతారు జనాలు. ఆయన చెప్పింది ఆ ఊరిలో వేదం అందుకే భగవంతుడితో సమానమైన విధంగా భగవంత్ కేసరి అంటూ ఫిక్స్ చేశారు. కేసరి అనేది ఇంటిపేరు భగవంత్ అనేది ఆయన పేరుగా ఈ సినిమాలో చూపించబోతున్నారట . ఈ క్రమంలోనే ఆ ఊరి ప్రజలకు ఆయన భగవంతుడు కావడంతో భగవంత్ కేసరిగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో భగవంత్ కేసరి ఫస్ట్ లుక్ పోస్టర్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news