Moviesబిగ్ బ్రేకింగ్: వరుణ్ తేజ్ తో లావణ్య పెళ్ళి నిజమే.. అఫిషియల్...

బిగ్ బ్రేకింగ్: వరుణ్ తేజ్ తో లావణ్య పెళ్ళి నిజమే.. అఫిషియల్ ప్రకటన వచ్చేసిందోచ్..!!

ఎస్ ..గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారని ..వీళ్ళనిశ్చితార్ధం జూన్ 9వ తేదీ హైదరాబాదులోని ఓ ఫంక్షన్ హాల్ లో గ్రాండ్గా జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే . అయితే కొద్దిసేపటికి జనసేన మెంబర్ ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు . సోషల్ మీడియాలో ఈ వార్త నిజమే అంటూ అధికారికంగా లావణ్య త్రిపాఠికి వరుణ్ తేజ్ కు అఫీషియల్ గా కంగ్రాట్యులేషన్స్ విషెస్ చెబుతూ వాళ్ళ ఫోటో ఎంగేజ్మెంట్ కార్డు ని కూడా పోస్ట్ చేశారు .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఈ వార్త జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది . మనకు తెలిసిందే మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న నాగబాబు కొడుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలు చేసి రానిస్తున్నారు. హీరోయిన్గా కూడా లావణ్య త్రిపాఠి అదే స్థాయిలో కొనసాగుతుంది. కొన్ని రోజులుగా వీళ్లు ప్రేమించుకుంటున్నారని ..డేటింగ్ కూడా చేస్తున్నారని వార్తలు వినిపించిన జనాలు లైట్గా తీసుకున్నారు.

అయితే వీళ్ళకి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ న్యూస్ నిజమే అంటూ అభిమానులు సైతం ఫిక్స్ అయిపోయారు. కాగా జూన్ 9వ తేదీ ఈ జంట నిశ్చితార్థంతో ఒకటి కాబోతుంది అని .. మెగా ఫ్యామిలీ కూడా అందుకు ఒప్పుకున్నారు అని ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఇదే క్రమంలో జనసేన మెంబర్ కూడా వాళ్ళిద్దరికీ కంగ్రాట్యులేషన్స్ అంటూ ట్యాగ్ చేసి మరి విష్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news