Moviesఉపాసన-చరణ్ ల కూతురు అంతటి మహాజాతకురాలా..? అంత మంచి శుభ గడియల్లో...

ఉపాసన-చరణ్ ల కూతురు అంతటి మహాజాతకురాలా..? అంత మంచి శుభ గడియల్లో పుట్టిందా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ..సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రామ్ చరణ్ ఉపాసనల పేర్లే మారుమ్రోగిపోతున్నాయి . దానంతటికీ కారణం వాళ్లు పదకండేళ్ల తర్వాత తల్లిదండ్రులు కావడమే . పెళ్లయినా దాదాపు 11 ఏళ్ల తర్వాత వీళ్లు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు .

మనకు తెలిసిందే మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం . డిసెంబర్ 12వ తేదీన అఫీషియల్ గా అనౌన్స్ చేశారు చిరంజీవి . కాగా అప్పటినుంచి మెగా కోడలు ఉపాసనకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఎట్టకేలకు అలాంటి వార్తలకు తెర దించి నిన్న తెల్లవారుజామున మంగళవారం ఉదయం 1:49 నిమిషాలకు పండంటి మహాలక్ష్మికి జన్మనిచ్చింది ఉపాసన.

ఈ క్రమంలోనే ఈ న్యూస్ మీడియాతో షేర్ చేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది అంటూ స్పందించాడు చిరంజీవి . ఈ క్రమంలోనే మనవరాలు పుట్టడంపై మెగాస్టార్ చిరంజీవి మీడియా ముఖంగా స్పందించారు “మంగళవారం ఉదయం ఒక గంట 49 నిమిషాలకు రాంచరణ్ ఉపాసనలకు పాప పుట్టింది. మెగా ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉన్నాం. వాళ్ళిద్దరికీ బ్లెస్సింగ్స్ అందించిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ . ఇన్నేళ్లకు ఆ భగవంతుడు దయవలన అందరి ఆశీస్సులు వలన ఆ కోరిక నెరవేరింది . ఇతర దేశాలు ఇతర ప్రాంతాల నుంచి మా స్నేహితులు సన్నిహితులు శ్రేయోభిలాషులు మా సంతోషాన్ని తమ సంతోషంగా భావించే అభిమానులు విషెస్ అందిస్తున్నారు. వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్ “అంటూ చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో ఆయన తన మనవరాలు పుట్టిన టైమ్ సైతం మెన్షన్ చేసి అవి శుభ ఘడియలు అంటూ చాలామంది చెప్పారు అంటూ చెప్పుకొచ్చారు . అంతేకాదు ఈ మధ్యకాలంలో చరణ్ ఎదుగుదల మెగా ఫ్యామిలీలో గుడ్ న్యూస్ అన్నిటికి కారణం తన మనవరాలు అంటూ పొగిడేసుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో మెగా ప్రిన్సెస్ బర్త్ టైం వైరల్ గా మారింది . నిజంగానే పాప ఇంటికి అన్ని మంచి శకునాలు తీసుకొచ్చిందా..? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news