టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ దేవదాస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్
సినిమా తర్వాత రామ్ తన కెరీర్‌లో సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. ఈ సినిమా తర్వాత వచ్చిన రెడ్, ది వారియర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ప్రస్తుతం రామ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో రామ్‌కు జంటగా శ్రీ లీల నటిస్తోంది. ఇక సెప్టెంబర్ 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రామ్ తన కెరీర్ లోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నాడు. దురదృష్టం ఏంటంటే రామ్ వదిలేసిన సినిమాలలో క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా ఉంది. దర్శకుడు గోపీచంద్ మలినేని మాస్ మహారాజా తేజ హీరోగా క్రాక్ సినిమాను తెరకెక్కించాడు. హిట్ లేక ఇబ్బంది పడుతున్న రవితేజకు బంపర్ హిట్ ఇచ్చాడు గోపీచంద్.
2019లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా కథ ముందుగా రామ్ వద్దకు వెళ్ళిందట. ఆ సమయంలోనే రామ్ పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్
చేస్తున్నాడు. అప్పుడే రామ్‌కు గోపీచంద్ మలినేని క్రాక్ కథ వినిపించాడట. రామ్ ఆ సినిమాకు ఒప్పుకుంటే ఇస్మార్ట్ శంకర్
సినిమా అయిన వెంటనే ఈ మూవీ తెరక్కెక్కించాలని భావించారట.
అయితే రామ్ ఎవరు ఊహించిన విధంగా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. గోపీచంద్‌కు నో చెప్పాడట. ఇక దీంతో క్రాక్ కథ రవితేజ వద్దకు వెళ్లడం.. ఆయన క్రాక్ సినిమా చేయడం హిట్ కొట్టటం అన్ని చకచకా జరిగిపోయాయి. ఏదేమైనా ఇస్మార్ట్ శంకర్ లాంటి భారీ విజయం తర్వాత క్రాక్ సినిమా పడుంటే రామ్ రేంజ్ మరోలా ఉండేది.