Moviesనాటి స్టార్ హీరోయిన్లు నేటి అత్త‌లు, అమ్మ‌లు... వీళ్ల రోజు సంపాద‌న...

నాటి స్టార్ హీరోయిన్లు నేటి అత్త‌లు, అమ్మ‌లు… వీళ్ల రోజు సంపాద‌న చూస్తే మైండ్ బ్లాకే..!

ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన‌ చాలామంది సీనియర్ హీరోయిన్స్ అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెట్ ఆర్టిస్ట్ గా మారుతున్నారు. తల్లి, వదిన, అత్తగా ఇలా అనేక రకాల కీరోల్స్ పోషిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గినా వీరు మాత్రం రెమ్యూన‌రేషన్ విషయంలో తగ్గేదేలే అంటూ గంట‌కు, రోజుకు లక్షల్లో రెమ్యూన‌రేషన్ తీసుకుంటున్నారు. ఆ లిస్టులో టాప్ ప్లేస్‌లో ఉన్న సీనియ‌ర్ హీరోయిన్ల‌ను చూద్దాం.

రమ్యకృష్ణ :
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రమ్యకృష్ణ ఇప్పటికీ అదే క్రేజ్‌తో కొనసాగుతుంది. ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాల్లో నటించకపోయినా తల్లి, అత్త‌, ఆంటీ పాత్రల్లోనూ తనదైన స్టైల్ లో నటిస్తోంది. రమ్యకృష్ణ ఈ పాత్రల‌లో నటించడానికి రోజుకి 3 నుంచి 4 లక్షల వ‌ర‌కు ఛార్జ్ చేస్తోంద‌ట‌.

జయసుధ :
జయసుధ ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర తారల అందరి సరసన నటించిన జయసుధ ప్రస్తుతం తల్లి పాత్రలోనూ, అత్త పాత్రలోను నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే జయసుధ రోజుకు 1.5 నుంచి 2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం.

నదియా :
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ నదియా కూడా ప్రస్తుతం తల్లి, అత్త‌ పాత్రల్లో నటిస్తూ తనదైన గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే నదియా రోజుకు 2 లక్షల వరకు తీసుకుంటుందట.

రోహిణి :
ఒకప్పుడు హీరోయిన్గా నటించిన రోహిణి ప్రస్తుతం సినిమాలో తల్లి పాత్రలో నటించేందుకు రోజుకు 50 నుంచి 60 వేల వరకు రెమ్యూనిరేషన్ పుచ్చుకుంటుందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news